మేను మెరిసిపోవాలంటే...
close
Published : 07/06/2021 12:44 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మేను మెరిసిపోవాలంటే...

అందంగా కనిపించాలని... దొరికిన సౌందర్య ఉత్పత్తులన్నీ వాడటం వల్ల వాటిలోని రసాయనాలు హాని చేసే ప్రమాదం ఉంది. బదులుగా ఇంటి చిట్కాలను పాటిస్తే అందమూ... ఆరోగ్యమూ మీ సొంతమవుతాయి.

పాలమీగడలో రెండు చుక్కల నిమ్మ రసం కలిపి స్నానానికి వెళ్లే ముందు రాసుకోవాలి. కాసేపయ్యాక కాస్త పెసరపిండిలో గులాబీ నీళ్లు కలిపి ఒంటికి పట్టించి నలుగు పెట్టుకుని స్నానం చేస్తే... మచ్చలు, మొటిమలు వంటివి తగ్గి ముఖం కాంతులీనుతుంది.
కీరదోస, నిమ్మరసాన్ని సమపాళ్లలో తీసుకుని చిటికెడు పసుపు కలపాలి.   ఈ మిశ్రమాన్ని ఉదయాన్నే ముఖానికి రాసుకుని పదిహేను నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేసుకోవాలి. ఇలా రోజూ చేస్తుంటే క్రమంగా చర్మఛాయ మెరుగుపడుతుంది.
రెండు చెంచాల నిమ్మరసంలో చెంచా తేనె, గుడ్డులోని తెల్లసొన వేసి బాగా గిలకొట్టాలి. దీన్ని ముఖం, మెడ, చేతులకు రాసుకుంటే... నలుపు తగ్గుతుంది. చర్మం బిగుతుగా మారుతుంది.
చుండ్రు ఇబ్బందిపెడుతున్నప్పుడు నిమ్మరసంలో రెండు చుక్కల ఆలివ్‌ నూనె కలిపి తలకు పట్టించి మర్దన చేయాలి. ఆపై ఆవిరి పట్టి గాఢత తక్కువగా ఉండే షాంపూతో తలస్నానం చేస్తే సరి. వెంట్రుకలు నిగనిగలాడతాయి. సమస్య దూరమవుతుంది.


మరిన్ని

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

యూత్ కార్నర్

మరిన్ని

'స్వీట్' హోం

మరిన్ని

వర్క్ & లైఫ్

మరిన్ని

సూపర్ విమెన్

మరిన్ని