రసాలతో మిలమిల!
close
Published : 10/06/2021 00:19 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

రసాలతో మిలమిల!

పండ్ల రసాల వల్ల బోలెడు లాభాలు. ఇవి యాంటీ ఏజింగ్‌ ఫ్యాక్టర్స్‌లా పనిచేసి చర్మాన్ని మెరిపిస్తాయి. మరప్పుడు అందం మీ సొంతమే కదా!
క్యారెట్‌, నిమ్మతో.. క్యారెట్‌లో ఎన్నో విటమిన్లుంటాయి. ఈ రసాన్ని క్రమం తప్పక తీసుకోవడం వల్ల చర్మం మిలమిలా మెరుస్తుంది. దీంట్లోని విటమిన్‌-ఎ సహజ యాంటీ ఆక్సిడెంట్‌లా పనిచేస్తుంది. ఇది వృద్ధాప్య ఛాయలను, పిగ్మెంటేషన్‌ ప్రక్రియలను అడ్డుకుంటుంది.
ఎలా చేసుకోవాలంటే... క్యారెట్‌ ముక్కలను బ్లెండర్‌లో వేసి మెత్తగా చేసుకోవాలి. ఓ పాత్రలో కప్పు నీళ్లు పోసి మరిగించి పక్కన పెట్టుకోవాలి. మీరు మెత్తగా చేసిన క్యారెట్‌ ప్యూరీని ఈ వేడి నీటిలో కలపాలి. దీంట్లో చెంచా నిమ్మరసం కలిపి తీసుకోవాలి. ఇలా క్రమం తప్పక తాగితే చర్మం కాంతిమంతంగా మారుతుంది.
దానిమ్మ, పుదీనా రసంతో.. ఇది తక్షణ శక్తినిచ్చే పండు. అంతేకాదు చర్మాన్ని మెరిపిస్తుంది కూడా. ఇందులో విటమిన్‌-సి, కె, యాంటీ ఏజింగ్‌ సమ్మేళనాలు మెండు. ఇవి కణాల పునరుత్పత్తిలో పాలుపంచుకుంటాయి. దాంతో చర్మం మెరుస్తుంది. ఒక కప్పు దానిమ్మ గింజలను మిక్సీలో వేసి మెత్తగా తిప్పాలి. ఇప్పుడీ ద్రవాన్నీ స్ట్రెయినర్‌ ద్వారా వడకట్టాలి. దీంట్లో కొన్ని పుదీనా ఆకులు వేసుకోవాలి. ఈ పండ్ల రసాన్ని రోజూ తీసుకుంటే ఆరోగ్యం, అందం రెండూ మీ సొంతమవుతాయి.  

 


మరిన్ని

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

యూత్ కార్నర్

మరిన్ని

'స్వీట్' హోం

మరిన్ని

వర్క్ & లైఫ్

మరిన్ని

సూపర్ విమెన్

మరిన్ని