వయసు కనపడనీయవు!
close
Updated : 13/06/2021 02:06 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

వయసు కనపడనీయవు!

వయసుతో పాటు శరీరంలో మార్పు రావడం సహజమే. ఇలాంటప్పుడు పోషకాహారం తీసుకోవడంతో పాటు చర్మం, జుట్టు సంరక్షణపైనా శ్రద్ధ చూపించాలి. అలాంటి చిట్కాలే ఇవి.
తేనె కలిపిన నిమ్మరసాన్ని ముఖానికి రాసి, ఇరవై నిమిషాల తర్వాత గోరువెచ్చని నీళ్లతో కడిగితే...టాన్‌ పోతుంది. చర్మం నిగారింపుతో కనిపిస్తుంది. నిమ్మలోని బ్లీచింగ్‌ గుణం వల్ల మచ్చలు తొలగిపోతాయి.
* కొబ్బరిపాలల్లో కాస్త పెసరపిండి, ఆలివ్‌నూనె కలిపి చర్మానికి నలుగు పెట్టండి. కొబ్బరిలోని విటమిన్లు, ఖనిజాలు కాంతిమంతంగా కనిపించేలా చేస్తాయి.
* పడుకునే ముందు రెండు చెంచాల రోజ్‌వాటర్‌లో అర చెంచా నిమ్మరసం, నాలుగు చుక్కలు గ్లిజరిన్‌ కలిపిన మిశ్రమం ముఖానికి రాసుకుంటే...చర్మం నవయౌవనంగా కనిపిస్తుంది.


మరిన్ని

తమ్మూ బ్యూటీ సీక్రెట్స్ ఏంటో తెలుసా? 

ఉదయం లేవగానే కళ్లన్నీ వాచిపోయి, గాలిబుడగలా పఫ్ఫీగా తయారైన ముఖాన్ని చూసుకుంటే ఎక్కడలేని నిరుత్సాహం ఆవహిస్తుంది. ముందు రోజు పని ఒత్తిడి, నిద్రలేమి, తీసుకున్న ఆహారం.. తదితర కారణాల వల్ల ఈ సమస్య చాలామందిలో సహజమే! అయితే దీన్ని వదిలించుకోవాలంటే తానో సింపుల్‌ చిట్కాను పాటిస్తానంటోంది మిల్కీ బ్యూటీ తమన్నా. ఈ టిప్‌ అద్భుతంగా పనిచేస్తుందని స్వీయానుభవంతో చెబుతున్నానంటూ ఆ వీడియోను సైతం తాజాగా ఇన్‌స్టాలో పోస్ట్‌ చేసింది. ఇప్పుడనే కాదు.. సందర్భం వచ్చినప్పుడల్లా, సోషల్‌ మీడియాలో తన సౌందర్య రహస్యాల్ని పంచుకుంటూ అమ్మాయిలందరికీ బ్యూటీ పాఠాలు నేర్పుతుంటుంది తమ్మూ.

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

యూత్ కార్నర్

మరిన్ని

'స్వీట్' హోం

మరిన్ని

వర్క్ & లైఫ్

మరిన్ని

సూపర్ విమెన్

మరిన్ని