చిక్కుల్లేని సింగారం!
close
Published : 30/06/2021 01:49 IST

చిక్కుల్లేని సింగారం!

అందంగా కనిపించేందుకు తరచూ మనం చేసే కొన్నిపనులు సరిగా చేయకపోతే కొత్త చిక్కుల్ని తెచ్చిపెడతాయి. అవేంటో చూద్దాం!

ల్లటి నీళ్లతో తరచూ ముఖం కడగడం మంచిదే అయినా... సబ్బుని అతిగా ఉపయోగించొద్దు. ముఖం పొడిబారుతుందనిపిస్తే... మాయిశ్చరైజర్‌ రాసుకోవాలి. లేదంటే మరింత ఎండిపోయినట్లుగా తయారవుతుంది. ఫలితంగా చిన్నవయసులోనే వృద్ధాప్య ఛాయలు పైబడతాయి.

* తరచూ క్లెన్సర్లను ఉపయోగించకండి. వాటిలోని బెంజైల్‌ పెరాక్సైడ్‌ స్కిన్‌ని ఇబ్బందికి గురిచేయొచ్చు. బదులుగా గులాబీ నీటితో తుడవండి.

* కొందరు జుట్టుకి నూనె ఎక్కువగా పెడుతుంటారు. ఇంకొందరు అసలు పెట్టరు. ఈ రెండింటివల్ల మాడు ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉంది. తలస్నానం చేయడానికి కనీసం గంటముందు నూనె పెట్టి మర్దనా చేయాలి. ఇందులోని విటమిన్లు, ఇతర మినరల్స్‌ కుదుళ్లకు పోషణ అందిస్తాయి.

* చర్మ సంరక్షణకు రకరకాల సౌందర్య ఉత్పత్తులు వాడతాం. వీటిని తరచూ మారుస్తుంటే... చర్మం పీహెచ్‌ స్థాయులని అంత వేగంగా సిద్ధం చేసుకోలేదు. అలానే ఎక్కువ రకాల్నీ ఒకేసారి వాడటమూ మంచి పద్ధతికాదు. వీలైతే చర్మ నిపుణులను కలవండి. వారు మీ చర్మతత్వానికి మేలైనవి సూచిస్తారు.

మరిన్ని

తమ్మూ బ్యూటీ సీక్రెట్స్ ఏంటో తెలుసా? 

ఉదయం లేవగానే కళ్లన్నీ వాచిపోయి, గాలిబుడగలా పఫ్ఫీగా తయారైన ముఖాన్ని చూసుకుంటే ఎక్కడలేని నిరుత్సాహం ఆవహిస్తుంది. ముందు రోజు పని ఒత్తిడి, నిద్రలేమి, తీసుకున్న ఆహారం.. తదితర కారణాల వల్ల ఈ సమస్య చాలామందిలో సహజమే! అయితే దీన్ని వదిలించుకోవాలంటే తానో సింపుల్‌ చిట్కాను పాటిస్తానంటోంది మిల్కీ బ్యూటీ తమన్నా. ఈ టిప్‌ అద్భుతంగా పనిచేస్తుందని స్వీయానుభవంతో చెబుతున్నానంటూ ఆ వీడియోను సైతం తాజాగా ఇన్‌స్టాలో పోస్ట్‌ చేసింది. ఇప్పుడనే కాదు.. సందర్భం వచ్చినప్పుడల్లా, సోషల్‌ మీడియాలో తన సౌందర్య రహస్యాల్ని పంచుకుంటూ అమ్మాయిలందరికీ బ్యూటీ పాఠాలు నేర్పుతుంటుంది తమ్మూ.

తరువాయి

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

యూత్‌ కార్నర్

మరిన్ని

మంచిమాట


'స్వీట్' హోం

మరిన్ని

వర్క్‌ & లైఫ్

మరిన్ని

సూపర్‌ విమెన్

మరిన్ని