చర్మ ఆరోగ్యానికి ఆహారం
close
Published : 08/07/2021 00:36 IST

చర్మ ఆరోగ్యానికి ఆహారం

చర్మం ముడతలు పడటం వల్ల వయసు మీరిన వారిలా కనిపిస్తారు. అలా కాకుండా స్కిన్‌ ఆరోగ్యంగా, బిగుతుగా ఉండాలంటే ఏం తినాలో, తాగాలో చూద్దామా..

నీళ్లు... చర్మం ముడతలు పడటానికి కారణాల్లో నీళ్లు తాగకపోడం కూడా ఒకటి. నీటిని సమృద్ధిగా తాగితే చర్మం సాగదు, ముడతలు పడదు. ఆరోగ్యంగా మెరుస్తూ ఉంటుంది.

విటమిన్‌-ఇ... దీని లోపం వల్ల కూడా ముడతలు వస్తాయి. అందుకే ఈ విటమిన్‌, ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలుండే పదార్థాలను రోజూ తీసుకోవాలి. రాజ్మా, అవిసెగింజలు, బాదం, కాజులనూ తీసుకోవాలి.

విటమిన్‌-సి... జామ, ఉసిరి, సంత్రా... తీసుకోవాలి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచుతాయి. చర్మాన్ని ఆరోగ్యంగానూ ఉంచుతాయి. 

కొబ్బరి... చర్మాన్ని తాజాగా, ఆరోగ్యంగా ఉంచుతుంది.

సోయాబీన్‌, మొలకలు... వీటితో కూడా చర్మం ఆరోగ్యంగా ఉంటుంది.

మరిన్ని

తమ్మూ బ్యూటీ సీక్రెట్స్ ఏంటో తెలుసా? 

ఉదయం లేవగానే కళ్లన్నీ వాచిపోయి, గాలిబుడగలా పఫ్ఫీగా తయారైన ముఖాన్ని చూసుకుంటే ఎక్కడలేని నిరుత్సాహం ఆవహిస్తుంది. ముందు రోజు పని ఒత్తిడి, నిద్రలేమి, తీసుకున్న ఆహారం.. తదితర కారణాల వల్ల ఈ సమస్య చాలామందిలో సహజమే! అయితే దీన్ని వదిలించుకోవాలంటే తానో సింపుల్‌ చిట్కాను పాటిస్తానంటోంది మిల్కీ బ్యూటీ తమన్నా. ఈ టిప్‌ అద్భుతంగా పనిచేస్తుందని స్వీయానుభవంతో చెబుతున్నానంటూ ఆ వీడియోను సైతం తాజాగా ఇన్‌స్టాలో పోస్ట్‌ చేసింది. ఇప్పుడనే కాదు.. సందర్భం వచ్చినప్పుడల్లా, సోషల్‌ మీడియాలో తన సౌందర్య రహస్యాల్ని పంచుకుంటూ అమ్మాయిలందరికీ బ్యూటీ పాఠాలు నేర్పుతుంటుంది తమ్మూ.

తరువాయి

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

యూత్‌ కార్నర్

మరిన్ని

మంచిమాట


'స్వీట్' హోం

మరిన్ని

వర్క్‌ & లైఫ్

మరిన్ని

సూపర్‌ విమెన్

మరిన్ని