ఈ డ్రెస్‌ ప్రత్యేకత అదే!
close
Published : 11/07/2021 00:45 IST

ఈ డ్రెస్‌ ప్రత్యేకత అదే!

ప్రపంచదేశాల అందాల తారలు తళుక్కున మెరిసే కేన్స్‌ చలన చిత్రోత్సవాలను తల్లిపాలపై అవగాహన కల్పించడానికి ఉపయోగించుకుంది ఇండియన్‌ ఇన్‌ఫ్లుయెన్సర్‌ దీపాబుల్లెర్‌ ఖోస్లా. ఈ ఏడాది నిర్వహించిన 74వ కేన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో భారతదేశం తరఫున కేన్స్‌ కార్పెట్‌పై ఒయ్యారంగా అడుగులేసిన భామల్లో దీపాబుల్లెర్‌ ఖోస్లా ఒకరు. నలుపు, పసుపు వర్ణాలున్న ఆఫ్‌ షోల్డర్‌ గౌన్‌ ధరించిన ఈమె, ఛాతీపై తల్లిపాలను సేకరించే బ్రెస్ట్‌ పంప్స్‌ను ఉంచుకుని అందరి చూపూ తనవైపు తిప్పుకొంది.

ఆ సందేశాలకు బదులుగా...

దీప తన జీవితంలో ప్రతి సందర్భాన్నీ సోషల్‌మీడియాలో పంచుకునేది. ఈ ఏడాది ఏప్రిల్‌లో ఆడపిల్లకు జన్మనిచ్చిన ఈమె, ఆ పసిపాపకు పాలివ్వడంపై ఇన్‌స్టాగ్రాంలో తన భావాలను పొందుపరిచింది. దీనిపై పలువురు చేసిన కామెంట్లకు కేన్స్‌లో ఇలా సమాధానం ఇచ్చింది. 2019లో ‘పోస్ట్‌ ఫర్‌ ఛేంజ్‌’ ఎన్జీవోను స్థాపించి మహిళల సమానత్వం, లైంగిక హక్కులు, మానసిక ఆరోగ్యంపై కృషి చేస్తోంది. ఈ అంశాలపై భర్త ఓలెగ్‌ బుల్లెర్‌ సహకారంతో యునిసెఫ్‌తో కలిసి ప్రచారం చేపట్టింది.

మరిన్ని

తమ్మూ బ్యూటీ సీక్రెట్స్ ఏంటో తెలుసా? 

ఉదయం లేవగానే కళ్లన్నీ వాచిపోయి, గాలిబుడగలా పఫ్ఫీగా తయారైన ముఖాన్ని చూసుకుంటే ఎక్కడలేని నిరుత్సాహం ఆవహిస్తుంది. ముందు రోజు పని ఒత్తిడి, నిద్రలేమి, తీసుకున్న ఆహారం.. తదితర కారణాల వల్ల ఈ సమస్య చాలామందిలో సహజమే! అయితే దీన్ని వదిలించుకోవాలంటే తానో సింపుల్‌ చిట్కాను పాటిస్తానంటోంది మిల్కీ బ్యూటీ తమన్నా. ఈ టిప్‌ అద్భుతంగా పనిచేస్తుందని స్వీయానుభవంతో చెబుతున్నానంటూ ఆ వీడియోను సైతం తాజాగా ఇన్‌స్టాలో పోస్ట్‌ చేసింది. ఇప్పుడనే కాదు.. సందర్భం వచ్చినప్పుడల్లా, సోషల్‌ మీడియాలో తన సౌందర్య రహస్యాల్ని పంచుకుంటూ అమ్మాయిలందరికీ బ్యూటీ పాఠాలు నేర్పుతుంటుంది తమ్మూ.

తరువాయి

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

యూత్‌ కార్నర్

మరిన్ని

మంచిమాట


'స్వీట్' హోం

మరిన్ని

వర్క్‌ & లైఫ్

మరిన్ని

సూపర్‌ విమెన్

మరిన్ని