మొటిమలు తగ్గించే టీట్రీ ఆయిల్‌..
close
Published : 13/07/2021 05:02 IST

మొటిమలు తగ్గించే టీట్రీ ఆయిల్‌..

అందానికీ, ఆరోగ్యానికీ మేలు చేసే ఎసెన్షియల్‌ నూనెల్లో టీట్రీ ఆయిల్‌ కూడా ఒకటి. దీన్ని నేరుగా కాకుండా క్యారియర్‌ ఆయిల్స్‌ అంటే బాదం, ఆలివ్‌, కొబ్బరి వంటి వాటితో కలిపి రాసుకోవాలి. మరి దీని ప్రయోజనాలేంటో తెలుసుకుందామా!

యాంటీ బ్యాక్టీరియల్‌గా పనిచేసే దీన్ని మొటిమల నివారణకు వాడొచ్చు. పెసర పిండిలో కాస్త రోజ్‌ వాటర్‌, రెండు చుక్కల టీట్రీ అయిల్‌ కలిపి ముఖానికి రాసి స్క్రబ్బర్‌లా వాడుతుంటే... సమస్య దూరమవుతుంది. మొటిమలు కూడా తగ్గుతాయి. చర్మఛాయా మెరుగుపడుతుంది.

* ఈ కాలంలో ఫంగల్‌ ఇన్ఫెక్షన్లు వస్తుంటాయి. అలాంటప్పుడు కొబ్బరినూనెలో కొద్దిగా టీట్రీ ఆయిల్‌ కలిపి వేళ్ల సందుల్లో, గోళ్లకు రాసుకుని మృదువుగా మర్దన చేస్తే  ఆరోగ్యంగా, అందంగా ఉంటాయి.

* చుండ్రు, పేలు వంటివి ఇబ్బంది పెడుతుంటే... ఆలివ్‌ నూనెలో కొద్దిగా టీట్రీ నూనెను వేసి తలకు పట్టించాలి. ఇలా ఓ గంటైనా ఉంచాక తలస్నానం చేస్తే సరి. ఇలా రెండు మూడు వారాలు చేసి చూడండి ఫలితం మీకే కనిపిస్తుంది.

మరిన్ని

తమ్మూ బ్యూటీ సీక్రెట్స్ ఏంటో తెలుసా? 

ఉదయం లేవగానే కళ్లన్నీ వాచిపోయి, గాలిబుడగలా పఫ్ఫీగా తయారైన ముఖాన్ని చూసుకుంటే ఎక్కడలేని నిరుత్సాహం ఆవహిస్తుంది. ముందు రోజు పని ఒత్తిడి, నిద్రలేమి, తీసుకున్న ఆహారం.. తదితర కారణాల వల్ల ఈ సమస్య చాలామందిలో సహజమే! అయితే దీన్ని వదిలించుకోవాలంటే తానో సింపుల్‌ చిట్కాను పాటిస్తానంటోంది మిల్కీ బ్యూటీ తమన్నా. ఈ టిప్‌ అద్భుతంగా పనిచేస్తుందని స్వీయానుభవంతో చెబుతున్నానంటూ ఆ వీడియోను సైతం తాజాగా ఇన్‌స్టాలో పోస్ట్‌ చేసింది. ఇప్పుడనే కాదు.. సందర్భం వచ్చినప్పుడల్లా, సోషల్‌ మీడియాలో తన సౌందర్య రహస్యాల్ని పంచుకుంటూ అమ్మాయిలందరికీ బ్యూటీ పాఠాలు నేర్పుతుంటుంది తమ్మూ.

తరువాయి

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

యూత్‌ కార్నర్

మరిన్ని

మంచిమాట


'స్వీట్' హోం

మరిన్ని

వర్క్‌ & లైఫ్

మరిన్ని

సూపర్‌ విమెన్

మరిన్ని