అమ్మ పద్ధతులనే పాటిస్తున్నా!
close
Published : 20/07/2021 00:50 IST

అమ్మ పద్ధతులనే పాటిస్తున్నా!

అందాల తార శ్రీదేవి వారసురాలిగా వెండి తెరకు పరిచయమైంది జాన్వీ కపూర్‌. కానీ విభిన్న పాత్రలను ఎంచుకుంటూ గుర్తింపు తెచ్చుకుంది. తన సౌందర్య పరిరక్షణలో తల్లి పాత్ర గురించి ఓ ఇంటర్వ్యూలో పంచుకుంది. శ్రీదేవికి రసాయనాలు ఎక్కువగా ఉండే ప్రొడక్ట్‌లను ఉపయోగించడం ఇష్టముండదట. అందుకే ఇంట్లో దొరికే వాటినే ఉపయోగించేదట. తలకు నూనెనీ ఎండిన పూలు, ఉసిరితో తనే కాచి సిద్ధం చేసేదట. వాటినే జాన్వీ కొనసాగిస్తోంది. ఇంకా ఏం చెప్పిందంటే...

‘ఆ రోజు ఏ పండు ఆహారంగా తీసుకుంటే దాని రసాన్నే పాలు లేదా వెన్నతో కలిపి ముఖానికి పట్టిస్తా. పండ్లలో సి విటమిన్‌ ఉంటుంది. చర్మానికి ఇది చాలా మంచిది. ఆరెంజ్‌, అరటి, బొప్పాయి, అవకాడో ఇలా దేన్నైనా ప్రయత్నించవచ్చు. జుట్టు విషయానికొస్తే ప్రతి మూడు రోజులకోసారి తలకు నూనెను పట్టించి, మర్దనా చేసుకుంటా. మెంతులు, ఉసిరి, కోడిగుడ్లతోపాటు మెంతి ఆకునూ తలకు పట్టిస్తా. ఇవి చుండ్రును దూరంగా ఉంచడంతోపాటు సహజ కండిషనింగ్‌నూ అందిస్తాయి. వీటితోపాటు నీరు ఎక్కువగా తీసుకోవడం, ఎప్పుడూ ఆనందంగా ఉండటం తప్పనిసరి’. చదివారుగా... నచ్చితే మీరూ ప్రయత్నించండి.

మరిన్ని

తమ్మూ బ్యూటీ సీక్రెట్స్ ఏంటో తెలుసా? 

ఉదయం లేవగానే కళ్లన్నీ వాచిపోయి, గాలిబుడగలా పఫ్ఫీగా తయారైన ముఖాన్ని చూసుకుంటే ఎక్కడలేని నిరుత్సాహం ఆవహిస్తుంది. ముందు రోజు పని ఒత్తిడి, నిద్రలేమి, తీసుకున్న ఆహారం.. తదితర కారణాల వల్ల ఈ సమస్య చాలామందిలో సహజమే! అయితే దీన్ని వదిలించుకోవాలంటే తానో సింపుల్‌ చిట్కాను పాటిస్తానంటోంది మిల్కీ బ్యూటీ తమన్నా. ఈ టిప్‌ అద్భుతంగా పనిచేస్తుందని స్వీయానుభవంతో చెబుతున్నానంటూ ఆ వీడియోను సైతం తాజాగా ఇన్‌స్టాలో పోస్ట్‌ చేసింది. ఇప్పుడనే కాదు.. సందర్భం వచ్చినప్పుడల్లా, సోషల్‌ మీడియాలో తన సౌందర్య రహస్యాల్ని పంచుకుంటూ అమ్మాయిలందరికీ బ్యూటీ పాఠాలు నేర్పుతుంటుంది తమ్మూ.

తరువాయి

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

యూత్‌ కార్నర్

మరిన్ని

మంచిమాట


'స్వీట్' హోం

మరిన్ని

వర్క్‌ & లైఫ్

మరిన్ని

సూపర్‌ విమెన్

మరిన్ని