ఇదట.. ఆలియా రహస్యం!
close
Updated : 28/07/2021 06:32 IST

ఇదట.. ఆలియా రహస్యం!

తండ్రి వారసత్వంతో పరిశ్రమలోకి అడుగుపెట్టినా తనకంటూ గుర్తింపు తెచ్చుకుని అగ్రతారగా ఎదిగింది ఆలియాభట్‌. తొలిసారి తెలుగులో ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రంలో నటిస్తోన్న ఈ అందాలభామ తన సౌందర్య రహస్యాలను పంచుకుంది....

అందంగా ఉండటం కోసం ఏం చేస్తానని చెప్పిందంటే...

* ముందుగా క్లెన్సింగ్‌/ చర్మానికి తగిన ఫేస్‌వాష్‌తో ముఖాన్ని శుభ్రంగా కడిగేయాలి.

*రోజ్‌వాటర్‌/ మంచి నీటితో ముఖాన్ని తడి చేసుకుని స్కిన్‌ మసాజర్‌తో మసాజ్‌ చేసుకోవాలి. దీనివల్ల రక్త ప్రసరణ బాగా జరుగుతుంది.

* నిద్ర సరిపోకపోయినా, ఒత్తిడి ఉన్నా ఆ ప్రభావం పడేది కళ్లపైనే. అందుకే కళ్లకింద అండర్‌ ఐ క్రీమ్‌ రాసుకోవాలి.

* తరువాత నైసినమైడ్‌ రాయాలి. ఇది ముఖంపై గీతలు, ముడతలు రాకుండా చేయడమే కాక చర్మాన్ని హైడ్రేట్‌ చేస్తుంది.

* కెఫిన్‌ సొల్యూషన్‌ డ్రాప్స్‌ను కళ్ల కింద రాయాలి. కళ్లు ఉబ్బినట్లుగా ఉన్నవారికి ఇది మంచి పరిష్కారం. ఫంక్షన్లు, ఫొటో, వీడియో షూట్స్‌ లేకపోతే దీన్ని వదిలేయొచ్చు.

* ఇప్పుడు మాయిశ్చరైజర్‌ రాయాలి. ఇది చర్మ ఆరోగ్యానికి చాలా ముఖ్యం కాబట్టి, నాణ్యమైనది ఎంచుకోవాలి.

* చివరగా సన్‌స్క్రీన్‌ రాసుకోవాలి. ఇంట్లోనే ఉన్నా ఇది తప్పదు. ఆ తర్వాతే మేకప్‌కి ప్రాధాన్యమివ్వాలి. అలాగే.. ముఖానికి రాసే వేటినైనా మెడతోపాటు చేతులకీ పట్టించాలి.

* సాయంత్రం బామ్‌ క్లెన్సర్‌ను ఉపయోగించాలి. కొద్దిగా నూనె స్వభావముండి, మేకప్‌ మొత్తాన్నీ తొలగిస్తుంది. ఇదండీ... ఆలియా స్కిన్‌కేర్‌ రొటీన్‌. నచ్చితే మీరూ ప్రయత్నించండి.

మరిన్ని

తమ్మూ బ్యూటీ సీక్రెట్స్ ఏంటో తెలుసా? 

ఉదయం లేవగానే కళ్లన్నీ వాచిపోయి, గాలిబుడగలా పఫ్ఫీగా తయారైన ముఖాన్ని చూసుకుంటే ఎక్కడలేని నిరుత్సాహం ఆవహిస్తుంది. ముందు రోజు పని ఒత్తిడి, నిద్రలేమి, తీసుకున్న ఆహారం.. తదితర కారణాల వల్ల ఈ సమస్య చాలామందిలో సహజమే! అయితే దీన్ని వదిలించుకోవాలంటే తానో సింపుల్‌ చిట్కాను పాటిస్తానంటోంది మిల్కీ బ్యూటీ తమన్నా. ఈ టిప్‌ అద్భుతంగా పనిచేస్తుందని స్వీయానుభవంతో చెబుతున్నానంటూ ఆ వీడియోను సైతం తాజాగా ఇన్‌స్టాలో పోస్ట్‌ చేసింది. ఇప్పుడనే కాదు.. సందర్భం వచ్చినప్పుడల్లా, సోషల్‌ మీడియాలో తన సౌందర్య రహస్యాల్ని పంచుకుంటూ అమ్మాయిలందరికీ బ్యూటీ పాఠాలు నేర్పుతుంటుంది తమ్మూ.

తరువాయి

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

యూత్‌ కార్నర్

మరిన్ని

మంచిమాట


'స్వీట్' హోం

మరిన్ని

వర్క్‌ & లైఫ్

మరిన్ని

సూపర్‌ విమెన్

మరిన్ని