ఇదే అసలైన బెనారస్‌ చీర!
close
Published : 28/07/2021 03:15 IST

ఇదే అసలైన బెనారస్‌ చీర!

సలు సిసలు బెనారసీ పట్టుచీర ఒక్కటైనా కొనుక్కోవాలని.. ముచ్చటపడని ఇల్లాలుంటుందా? కానీ అది అసలైన బెనారసీ చీరే అని ఏంటి నమ్మకం? బోలెడు డబ్బులు పోసి కొన్న ఆ చీర నకిలీదైతే? ఆ సమస్య రాకుండా ఉండేందుకు... మహిళల్లో స్వచ్ఛమైన బెనారస్‌ చీరల పట్ల ప్రేమను పెంచేందుకు ఐఐటీ-బీహెచ్‌యూ (బెనారస్‌ హిందు యూనివర్సిటీ)ఓ వినూత్నమైన ప్రయోగానికి తెరతీసింది. చీరలోనే ఒక క్యూ ఆర్‌కోడ్‌ని ఉండేట్టు చేస్తోంది. కొనుగోలుదారులు ఈ క్యూఆర్‌ కోడ్‌ని స్కాన్‌ చేసినప్పుడు ఆ చీరని ఎక్కడ నేశారు, నేతన్న వివరాలు, నాణ్యతని తెలిసే సిల్క్‌మార్క్‌, జీఐలోగో వంటివన్నీ కనిపిస్తాయి. ‘చాలామంది ఎక్కువ డబ్బులు వెచ్చించాం కాబట్టి అదే అసలైన బెనారస్‌ అనుకుంటారు. మరికొందరికి పవర్‌లూమ్‌కి, హ్యాండ్‌లూమ్‌కి తేడా తెలియదు. ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడించడం వల్ల నేత పని వారికీ మేలు జరుగుతోందని’ అంటున్నారు ఈ ఆవిష్కరణలో పాలుపంచుకున్న సాంకేతిక నిపుణులు.

మరిన్ని

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

యూత్‌ కార్నర్

మరిన్ని

మంచిమాట


'స్వీట్' హోం

మరిన్ని

వర్క్‌ & లైఫ్

మరిన్ని

సూపర్‌ విమెన్

మరిన్ని