మృతకణాలను వదిలించే స్క్రబ్బర్స్‌
close
Published : 06/08/2021 01:36 IST

మృతకణాలను వదిలించే స్క్రబ్బర్స్‌

మృదువైన చర్మం కావాలంటే ఆహారంతో పాటు మృతకణాలు లేకుండా జాగ్రత్తపడటం కూడా అవసరం అంటున్నారు సౌందర్య నిపుణులు. దీని కోసం  కొన్ని స్క్రబ్బర్స్‌ లభ్యమవుతున్నాయి. అవేంటో చూద్దాం.

బాడీ స్క్రబ్బర్‌... సిలికాన్‌తో తయారైన చిన్న పరిమాణంలో ఉండే బాడీ స్క్రబ్బర్‌ చేతికి గ్లవుజులా ఇమిడిపోతుంది. దీంతో మృదువుగా రుద్దుకుంటే చాలు. మృతకణాలన్నీ పోయి, చర్మం మెరిసిపోతుంది. అలాగే బెల్ట్‌ను పోలినట్లుగా ఉండే స్క్రబ్బర్‌కు ఇరువైపులా చేతులతో పట్టుకునే వీలుంటుంది. దీనిపై ఉండే మృదువైన బ్రష్‌తో స్క్రబ్‌ చేసుకోవచ్చు. మరో రకం... పొడవైన చెక్కకు చివర్లో గుండ్రని స్క్రబ్బర్‌ ఉంటుంది. ఇది వీపు రుద్దుకోవడానికి ఉపయోగపడుతుంది.

పాదాలకు ప్రత్యేకం... ఇది పాదాలకే కాదు మసాజ్‌కూ ఉపయోగపడుతుంది. పాదరక్షల ఆకారంలో ఉండే మృదువైన బ్రష్‌ ఇది. ఇందులో పాదాన్ని ఉంచి మెల్లగా రుద్దితే చాలు. మురికి పోవడమే కాదు,  మసాజ్‌ చేసుకున్నట్టయ్యి అలసట కూడా దూరమవుతుంది.

మాడుకి రక్తప్రసరణ... అరచేతిలో ఇమిడి ఉండే దీనిపై షాంపూ వేసుకుని తలలో మృదువుగా రుద్దితే సరి. కుదుళ్లు, మాడు శుభ్రమై.. శిరోజాలకు రక్తప్రసరణ బాగా జరుగుతుంది. మాడుపై ఉండే మురికీ వదులుతుంది.

ముఖం మృదువుగా... ఈ స్క్రబ్బర్‌ మృదువైన పీచుతో పౌడర్‌ రాసే పఫ్‌ ఆకారంలో ఉంటుంది. ముఖాన్ని కడిగేటప్పుడు దీంతో మెల్లగా రుద్దితే చర్మ కణాల్లోని మురికీ, మృతకణాలను పోగొడుతుంది.


Advertisement


మరిన్ని

తమ్మూ బ్యూటీ సీక్రెట్స్ ఏంటో తెలుసా? 

ఉదయం లేవగానే కళ్లన్నీ వాచిపోయి, గాలిబుడగలా పఫ్ఫీగా తయారైన ముఖాన్ని చూసుకుంటే ఎక్కడలేని నిరుత్సాహం ఆవహిస్తుంది. ముందు రోజు పని ఒత్తిడి, నిద్రలేమి, తీసుకున్న ఆహారం.. తదితర కారణాల వల్ల ఈ సమస్య చాలామందిలో సహజమే! అయితే దీన్ని వదిలించుకోవాలంటే తానో సింపుల్‌ చిట్కాను పాటిస్తానంటోంది మిల్కీ బ్యూటీ తమన్నా. ఈ టిప్‌ అద్భుతంగా పనిచేస్తుందని స్వీయానుభవంతో చెబుతున్నానంటూ ఆ వీడియోను సైతం తాజాగా ఇన్‌స్టాలో పోస్ట్‌ చేసింది. ఇప్పుడనే కాదు.. సందర్భం వచ్చినప్పుడల్లా, సోషల్‌ మీడియాలో తన సౌందర్య రహస్యాల్ని పంచుకుంటూ అమ్మాయిలందరికీ బ్యూటీ పాఠాలు నేర్పుతుంటుంది తమ్మూ.

తరువాయి

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

యూత్‌ కార్నర్

మరిన్ని

మంచిమాట


'స్వీట్' హోం

మరిన్ని

వర్క్‌ & లైఫ్

మరిన్ని

సూపర్‌ విమెన్

మరిన్ని