దీపిక.. మూడు సూత్రాలు
close
Updated : 15/08/2021 04:18 IST

దీపిక.. మూడు సూత్రాలు

బాలీవుడ్‌ అందాల తారల్లో దీపికా పదుకోణ్‌ ఒకరు. ఆమె తన అందానికి మూడు సూత్రాలను పాటిస్తానంటోంది. ‘ఒకటి.. నీళ్లు, పండ్లు, పండ్ల రసాలను ఎక్కువగా తీసుకుంటాను. ఇవి చర్మాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచడంతోపాటు అవసరమైన పోషకాలనీ సహజంగా అందిస్తాయి. చక్కెరకు దూరంగా ఉంటా. రెండు.. స్కిన్‌ కేర్‌ రొటీన్‌లో స్కిన్‌ రోలర్‌ తప్పనిసరి. ఇది ముఖానికి రక్తప్రసరణ బాగా జరిగేలా చేసి, ఆరోగ్యంగా కనిపించేలా చేస్తుంది. ఇక మూడోది వ్యాయామం. రోజులో కొంత సమయమైనా దీనికి తప్పకుండా కేటాయిస్తా. ఇది కొలాజిన్‌ ఉత్పత్తికి సాయపడటమే కాకుండా చర్మానికి తగినంత ఆక్సీజన్‌నూ సరఫరా చేస్తుంది’ అని చెబుతోంది. దీపిక రహస్యం తెలిసిందిగా! మీకూ ప్రయత్నించాలనుందా?


Advertisement


మరిన్ని

తమ్మూ బ్యూటీ సీక్రెట్స్ ఏంటో తెలుసా? 

ఉదయం లేవగానే కళ్లన్నీ వాచిపోయి, గాలిబుడగలా పఫ్ఫీగా తయారైన ముఖాన్ని చూసుకుంటే ఎక్కడలేని నిరుత్సాహం ఆవహిస్తుంది. ముందు రోజు పని ఒత్తిడి, నిద్రలేమి, తీసుకున్న ఆహారం.. తదితర కారణాల వల్ల ఈ సమస్య చాలామందిలో సహజమే! అయితే దీన్ని వదిలించుకోవాలంటే తానో సింపుల్‌ చిట్కాను పాటిస్తానంటోంది మిల్కీ బ్యూటీ తమన్నా. ఈ టిప్‌ అద్భుతంగా పనిచేస్తుందని స్వీయానుభవంతో చెబుతున్నానంటూ ఆ వీడియోను సైతం తాజాగా ఇన్‌స్టాలో పోస్ట్‌ చేసింది. ఇప్పుడనే కాదు.. సందర్భం వచ్చినప్పుడల్లా, సోషల్‌ మీడియాలో తన సౌందర్య రహస్యాల్ని పంచుకుంటూ అమ్మాయిలందరికీ బ్యూటీ పాఠాలు నేర్పుతుంటుంది తమ్మూ.

తరువాయి

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

యూత్‌ కార్నర్

మరిన్ని

మంచిమాట


'స్వీట్' హోం

మరిన్ని

వర్క్‌ & లైఫ్

మరిన్ని

సూపర్‌ విమెన్

మరిన్ని