చివర్లు చిట్లకుండా!
close
Published : 17/08/2021 01:43 IST

చివర్లు చిట్లకుండా!

జుట్టు తడిగా ఉన్నప్పుడే పడుకోవడం, గట్టిగా ఉండే దుప్పట్లు, దిండ్లు, కాలుష్యం, పోషకలేమి, సౌందర్య ఉత్పత్తులు, సాధనాలు, సంరక్షణ లేకపోవడం... ఇలా జుట్టు చిట్లడానికి బోలెడు కారణాలు...

కురులు ఆరోగ్యంగా, చిట్లకుండా ఉండాలంటే పోషకాహారం తీసుకోవాలి. ముఖ్యంగా ప్రొటీన్‌, ఇనుము, ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలున్న పదార్థాలను తీసుకోవాలి. పాలు, పాల ఉత్పత్తులు, గుడ్లు, చేపలు, ఆకు కూరలను రోజువారీ ఆహారంలో చేర్చుకోవాలి.

* జుట్టుకు తప్పనిసరిగా పూతలు, కండిషనర్‌ వాడాల్సిందే. పూతలు కేశాలకు కావాల్సిన పోషణను అందించి తేమగా ఉంచుతాయి. మూడు నెలలకోసారి జుట్టు చివర్లను కత్తిరిస్తూ ఉండాలి.

* తేనె, పెరుగు, అరటిపండు, బొప్పాయిలతో పూతలను ఇంట్లోనే ప్రయత్నించొచ్చు. వీటిని జుట్టుకు పట్టించి ఇరవై నిమిషాల తర్వాత కడిగేయాలి. షాంపూ చేసుకున్నాక కండిషనర్‌ వాడటం మరవొద్దు.మరిన్ని

తమ్మూ బ్యూటీ సీక్రెట్స్ ఏంటో తెలుసా? 

ఉదయం లేవగానే కళ్లన్నీ వాచిపోయి, గాలిబుడగలా పఫ్ఫీగా తయారైన ముఖాన్ని చూసుకుంటే ఎక్కడలేని నిరుత్సాహం ఆవహిస్తుంది. ముందు రోజు పని ఒత్తిడి, నిద్రలేమి, తీసుకున్న ఆహారం.. తదితర కారణాల వల్ల ఈ సమస్య చాలామందిలో సహజమే! అయితే దీన్ని వదిలించుకోవాలంటే తానో సింపుల్‌ చిట్కాను పాటిస్తానంటోంది మిల్కీ బ్యూటీ తమన్నా. ఈ టిప్‌ అద్భుతంగా పనిచేస్తుందని స్వీయానుభవంతో చెబుతున్నానంటూ ఆ వీడియోను సైతం తాజాగా ఇన్‌స్టాలో పోస్ట్‌ చేసింది. ఇప్పుడనే కాదు.. సందర్భం వచ్చినప్పుడల్లా, సోషల్‌ మీడియాలో తన సౌందర్య రహస్యాల్ని పంచుకుంటూ అమ్మాయిలందరికీ బ్యూటీ పాఠాలు నేర్పుతుంటుంది తమ్మూ.

తరువాయి

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

యూత్‌ కార్నర్

మరిన్ని

మంచిమాట


'స్వీట్' హోం

మరిన్ని

వర్క్‌ & లైఫ్

మరిన్ని

సూపర్‌ విమెన్

మరిన్ని