అందానికి అదితి!
close
Updated : 20/08/2021 05:53 IST

అందానికి అదితి!

ఇంట్లో ఉన్నప్పుడు చర్మం చెప్పిన మాటే వింటానంటోంది అందాల అదితీరావ్‌హైదరీ. ‘షూటింగ్‌లు లేకపోయినా, ఏమాత్రం తీరిక దొరికినా... వంటింట్లో ఉండాల్సిన సరకులన్నీ నా మొహంమీదే ఉంటాయి. బొప్పాయి, ఓట్స్‌, సెనగపిండి, పాలు... అలొవెరా. కాలానుగుణంగా వీటిల్లో నచ్చిన వాటిని ఎంపిక చేసుకోవడం, వాటితో ప్యాక్స్‌ వేసుకోవడం నాకిష్టం.
బయటకు వెళ్లాల్సి వస్తే సన్‌స్క్రీన్‌ తప్పనిసరి. అది లేకుండా అడుగు బయటపెట్టను. ఇక ఎవరైనా మనసుకు నచ్చిన ఆహారం తింటారు నేనుమాత్రం... చర్మానికి మేలు చేసే ఆహారం తింటాను. యాంటీ ఆక్సిడెంట్లు, ఫ్యాటీయాసిడ్లు పుష్కలంగా ఉండే స్ట్రాబెర్రీలు, చెర్రీలతోపాటు గుడ్లు, చేపలకి ప్రాధాన్యం ఇస్తా. రాత్రిళ్లు లేటుగా తినడం అంటే నాకిష్టం ఉండదు. అది జీర్ణవ్యవస్థపై ప్రభావం చూపుతుంది. త్వరగా తినేస్తాను. కార్బోహైడ్రేట్స్‌ కన్నా... కాయగూరలనే ఎక్కువ తింటాను’ అంటోంది అదితీ.


Advertisement


మరిన్ని

తమ్మూ బ్యూటీ సీక్రెట్స్ ఏంటో తెలుసా? 

ఉదయం లేవగానే కళ్లన్నీ వాచిపోయి, గాలిబుడగలా పఫ్ఫీగా తయారైన ముఖాన్ని చూసుకుంటే ఎక్కడలేని నిరుత్సాహం ఆవహిస్తుంది. ముందు రోజు పని ఒత్తిడి, నిద్రలేమి, తీసుకున్న ఆహారం.. తదితర కారణాల వల్ల ఈ సమస్య చాలామందిలో సహజమే! అయితే దీన్ని వదిలించుకోవాలంటే తానో సింపుల్‌ చిట్కాను పాటిస్తానంటోంది మిల్కీ బ్యూటీ తమన్నా. ఈ టిప్‌ అద్భుతంగా పనిచేస్తుందని స్వీయానుభవంతో చెబుతున్నానంటూ ఆ వీడియోను సైతం తాజాగా ఇన్‌స్టాలో పోస్ట్‌ చేసింది. ఇప్పుడనే కాదు.. సందర్భం వచ్చినప్పుడల్లా, సోషల్‌ మీడియాలో తన సౌందర్య రహస్యాల్ని పంచుకుంటూ అమ్మాయిలందరికీ బ్యూటీ పాఠాలు నేర్పుతుంటుంది తమ్మూ.

తరువాయి

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

యూత్‌ కార్నర్

మరిన్ని

మంచిమాట


'స్వీట్' హోం

మరిన్ని

వర్క్‌ & లైఫ్

మరిన్ని

సూపర్‌ విమెన్

మరిన్ని