పెద్దగా కనిపిస్తున్నారా?
close
Published : 26/08/2021 00:37 IST

పెద్దగా కనిపిస్తున్నారా?

కొందరు తమ వయసు కంటే పెద్దవారిలా కనిపిస్తారు. అందుకు కారణాలు ఏంటి?  ఆ సమస్యను ఎలా అధిగమించాలో చూద్దామా...

* ఒత్తిడి.. దీని ప్రభావం మొదట పడేది ముఖం (చర్మం) మీదే. ఆందోళన ఎక్కువైతే కార్టిసోల్‌ అదే పనిగా విడుదలై ప్రీమెచ్యూర్‌ ఏజింగ్‌కు కారణమవుతుంది. అధిక ఆందోళన, ఒత్తిడి వల్ల చర్మంపై గీతలు, ముడతలు త్వరగా వస్తాయి. యోగా, వ్యాయామం, నడక, స్నేహితులతో సరదగా గడపడం వంటివి చేయాలి.

* సబ్బు... దీంట్లోని గాఢ రసాయనాలు చర్మంలోని సహజ నూనెలను పీల్చేస్తాయి. దాంతో చర్మం నిర్జీవంగా మారి గీతలు, ముడతలు కనిపిస్తాయి. అప్పుడూ పెద్దవారిలా కనిపిస్తారు. అందుకే తక్కువ గాఢత ఉండే క్లెన్సర్‌తో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. వెంటనే మాయిశ్చరైజర్‌ రాసుకోవాలి. రోజూ ఏడెనిమిది గ్లాసుల నీళ్లు తాగాలి. అప్పుడే శరీరం తాజాగా ఉంటుంది.

* నిద్రలేమి... తగినంత నిద్రపోయినప్పుడు మాత్రమే శక్తిని పుంజుకోగలుగతాం. మనం నిద్రపోతున్న సమయంలో చర్మం మరమ్మతులు చేసుకుంటుంది. నిద్రలేమి వల్ల అది తనను తాను రీజెనువేట్‌ చేసుకోలేదు. ఫలితంగా ముఖంపై ముడతలొస్తాయి. రోజుకు కనీసం ఏడెనిమిది గంటలపాటు కంటినిండా నిద్రపోవాలి.

* ఎక్కువగా చక్కెరలు... కొల్లాజెన్‌, ఎలాస్టిన్‌లు చర్మానికి స్థితిస్థాపకతను కలిగించి యౌవ్వనంగా ఉండేలా చేస్తాయి. కొన్ని అధ్యయనాల ప్రకారం చక్కెర, గ్లూకోజ్‌ ఎక్కువగా ఉండే పదార్థాలను తీసుకున్న వారిలో ఈ రెండింట్లో అమైనో ఆమ్లాలు కలిసి వాటిని దెబ్బతీస్తాయి. ఫలితం శరీరం సహజ మరమ్మతులకు ఆటంకం కలుగుతుంది. కాబట్టి తీపిని తగ్గించడం మంచిది.మరిన్ని

తమ్మూ బ్యూటీ సీక్రెట్స్ ఏంటో తెలుసా? 

ఉదయం లేవగానే కళ్లన్నీ వాచిపోయి, గాలిబుడగలా పఫ్ఫీగా తయారైన ముఖాన్ని చూసుకుంటే ఎక్కడలేని నిరుత్సాహం ఆవహిస్తుంది. ముందు రోజు పని ఒత్తిడి, నిద్రలేమి, తీసుకున్న ఆహారం.. తదితర కారణాల వల్ల ఈ సమస్య చాలామందిలో సహజమే! అయితే దీన్ని వదిలించుకోవాలంటే తానో సింపుల్‌ చిట్కాను పాటిస్తానంటోంది మిల్కీ బ్యూటీ తమన్నా. ఈ టిప్‌ అద్భుతంగా పనిచేస్తుందని స్వీయానుభవంతో చెబుతున్నానంటూ ఆ వీడియోను సైతం తాజాగా ఇన్‌స్టాలో పోస్ట్‌ చేసింది. ఇప్పుడనే కాదు.. సందర్భం వచ్చినప్పుడల్లా, సోషల్‌ మీడియాలో తన సౌందర్య రహస్యాల్ని పంచుకుంటూ అమ్మాయిలందరికీ బ్యూటీ పాఠాలు నేర్పుతుంటుంది తమ్మూ.

తరువాయి

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

యూత్‌ కార్నర్

మరిన్ని

మంచిమాట


'స్వీట్' హోం

మరిన్ని

వర్క్‌ & లైఫ్

మరిన్ని

సూపర్‌ విమెన్

మరిన్ని