బ్రా మచ్చలు పడుతున్నాయా
close
Updated : 27/08/2021 00:41 IST

బ్రా మచ్చలు పడుతున్నాయా

మనలో కొందరికి బ్రా స్ట్రాప్స్‌ వల్ల ఆ ప్రాంతమంతా రంగు మారిపోతుంది. ఎందుకిలా జరుగుతుంది. ఆ మచ్చలను పోగొట్టాలంటే ఏం చేయాలో చూద్దామా...

నీ పాలు... బాదం నూనె: మరకలు పడిన చోట పాలు, బాదం నూనె మిశ్రమాన్ని రాసి మృదువుగా మర్దనా చేయాలి. తర్వాత ఆ ప్రాంతాన్ని తువాలుతో మూసేసి పది నిమిషాలు ఆగాక గోరువెచ్చటి నీటితో కడిగేయాలి. సబ్బు వాడొద్దు.

* నిమ్మ రసం, చక్కెర స్క్రబ్‌: ఈ మిశ్రమంతో మెడ వద్దే కాదు ఈ మరకలున్న భుజాలనూ శుభ్రం చేసుకోవాలి. చెంచా చక్కెరలో అర చెంచా నిమ్మరసం వేసి బాగా కలిపి ఆ మిశ్రమాన్ని మరకలున్న చోట రాసి మర్దనా చేయాలి. ఇలా తరచూ చేస్తే మరకలు పోతాయి.

* ఎస్సెనియల్‌ నూనెలు: లావెండర్‌, టీ ట్రీ లాంటి నూనెలతో ఆ ప్రాంతాన్ని మృదువుగా రుద్దాలి. వీటి నుంచి చక్కగా పోషకాలు అంది చర్మం కాంతులీనుతుంది.

* సన్‌స్క్రీన్‌: దీన్ని తరచూ రాస్తూ ఉంటే సూర్యరశ్మి నుంచి వచ్చే అతినీల లోహిత కిరణాల బారినుంచి చర్మాన్ని కాపాడుకో వచ్చు. పూర్వపు మరకలు మరింత పెరగకుండానూ ఉంటాయి.

* వాటర్‌ థెరపీ: నీళ్లు చర్మ ఆరోగ్యానికి చాలా అవసరం. తగినన్ని నీళ్లు తాగడం వల్ల ఆరోగ్యంగా ఉండటమే కాకుండా చర్మం కూడా తాజాగా, కాంతులీనుతుంది. అంతేకాదు మరకలు, మచ్చలు రాకుండా ఉంటాయి.

* పెరుగు, పసుపు పూత... చెంచా పెరుగులో చిటికెడు పసుపు వేసి బాగా కలపాలి ఈ మిశ్రమాన్ని మచ్చలున్న చోట రాయాలి. ఇలా తరచూ చేస్తూ ఉంటే మార్పు మీకే తెలుస్తుంది.

* సరైంది ఎంచుకోండి...  వీటన్నింటితో పాటు వీలైతే స్ట్రాప్‌లెస్‌ లేదా చిన్న స్ట్రాప్స్‌ ఉండే బ్రాలను ఎంచుకోండి.మరిన్ని

తమ్మూ బ్యూటీ సీక్రెట్స్ ఏంటో తెలుసా? 

ఉదయం లేవగానే కళ్లన్నీ వాచిపోయి, గాలిబుడగలా పఫ్ఫీగా తయారైన ముఖాన్ని చూసుకుంటే ఎక్కడలేని నిరుత్సాహం ఆవహిస్తుంది. ముందు రోజు పని ఒత్తిడి, నిద్రలేమి, తీసుకున్న ఆహారం.. తదితర కారణాల వల్ల ఈ సమస్య చాలామందిలో సహజమే! అయితే దీన్ని వదిలించుకోవాలంటే తానో సింపుల్‌ చిట్కాను పాటిస్తానంటోంది మిల్కీ బ్యూటీ తమన్నా. ఈ టిప్‌ అద్భుతంగా పనిచేస్తుందని స్వీయానుభవంతో చెబుతున్నానంటూ ఆ వీడియోను సైతం తాజాగా ఇన్‌స్టాలో పోస్ట్‌ చేసింది. ఇప్పుడనే కాదు.. సందర్భం వచ్చినప్పుడల్లా, సోషల్‌ మీడియాలో తన సౌందర్య రహస్యాల్ని పంచుకుంటూ అమ్మాయిలందరికీ బ్యూటీ పాఠాలు నేర్పుతుంటుంది తమ్మూ.

తరువాయి

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

యూత్‌ కార్నర్

మరిన్ని

మంచిమాట


'స్వీట్' హోం

మరిన్ని

వర్క్‌ & లైఫ్

మరిన్ని

సూపర్‌ విమెన్

మరిన్ని