అందమైన మోముకు!
close
Updated : 29/08/2021 04:33 IST

అందమైన మోముకు!

సౌందర్య పోషణలో రకరకాల చిట్కాలు పాటిస్తాం. అయితే వీటితోపాటు రోజువారీ చేసే పనుల పట్ల ఉదాసీనంగానో, నిర్లక్ష్యంగా ఉంటాం. అలా కాకుండా అందాన్ని మెరుగుపరుచుకోవడానికి కొన్నింటిని పాటిస్తే అది రెట్టింపవుతుంది, మరి ఆ చిట్కాలేంటో చూద్దాం.

ముఖాన్ని శుభ్రం చేసుకోవడానికి ఫేస్‌వాష్‌నే వాడాలి. అలాగే శుభ్రం చేసుకున్న వెంటనే మాయిశ్చరైజర్‌ రాసుకోవాలి.

* కురుల కోసం ప్రత్యేకమైన పోషణ, సంరక్షణ తీసుకోవాలి. కొబ్బరినూనెతో మర్దనా చేసుకోవడం, గాఢత తక్కువగా ఉండే షాంపూ, కండిషనర్‌ వాడటం, జుట్టు పూతలు... ఇవన్నీ మీ కేశాలను ఆరోగ్యంగా ఉంచుతాయి.

* అన్ని రకాల పోషకాలు అందేలా ఆహారం తీసుకోవాలి. అవసరమైతే వైద్యుల సలహా మేరకు విటమిన్‌సప్లిమెంట్స్‌ను వాడాలి. అప్పుడే మీ జుట్టు, చర్మం, గోళ్లు ఆరోగ్యంగా ఉంటాయి.

* పెదాలకు రాత్రి పడుకోబోయే ముందు తప్పనిసరిగా లిప్‌బామ్‌/పెట్రోలియమ్‌ జెల్లీ రాసుకోవాలి.

* చర్మంతోపాటు, నఖ సంరక్షణకు సమయం కేటాయించాలి.

* మొటిమలను గిల్లకూడదు.  సాన్నానికి గోరువెచ్చటి, చల్లటి నీళ్లనే ఉపయోగించాలి.

* రోజులో తగినన్ని నీళ్లు తాగాలి. అప్పుడే శరీరం డీహైడ్రేట్‌కు కాకుండా తాజాగా ఉంటుంది.

* రోజూ అరగంట చొప్పున వారంలో కనీసం అయిదుసార్లు వ్యాయామం చేయాలి.

* రోజులో అల్పాహారాన్ని మానకూడదు. ఎందుకంటే మిగతా రోజంతా మీరెలా ఉండాలో ఇదే నిర్ణయిస్తుంది.

* కంటినిండా అంటే దాదాపు ఏడెనిమిది గంటలు నిద్రపోవాలి. అప్పుడే చర్మం ముడతలు, గీతలు పడకుండా ఆరోగ్యంగా, తాజాగా ఉంటుంది.

* ఆహారంలో ఎక్కువగా పండ్లు, కాయగూరలను తీసుకోవాలి.

* జంక్‌ ఫుడ్‌కు సాధ్యమైనంతగా దూరంగా ఉండాలి.

ఇవన్నీ తప్పనిసరిగా పాటిస్తే మీ చర్మం ఎల్లప్పుడూ ఆరోగ్యంగా, అందంగా ఉంటుంది ఏమంటారు మరి పాటిస్తారా..


Advertisement


మరిన్ని

తమ్మూ బ్యూటీ సీక్రెట్స్ ఏంటో తెలుసా? 

ఉదయం లేవగానే కళ్లన్నీ వాచిపోయి, గాలిబుడగలా పఫ్ఫీగా తయారైన ముఖాన్ని చూసుకుంటే ఎక్కడలేని నిరుత్సాహం ఆవహిస్తుంది. ముందు రోజు పని ఒత్తిడి, నిద్రలేమి, తీసుకున్న ఆహారం.. తదితర కారణాల వల్ల ఈ సమస్య చాలామందిలో సహజమే! అయితే దీన్ని వదిలించుకోవాలంటే తానో సింపుల్‌ చిట్కాను పాటిస్తానంటోంది మిల్కీ బ్యూటీ తమన్నా. ఈ టిప్‌ అద్భుతంగా పనిచేస్తుందని స్వీయానుభవంతో చెబుతున్నానంటూ ఆ వీడియోను సైతం తాజాగా ఇన్‌స్టాలో పోస్ట్‌ చేసింది. ఇప్పుడనే కాదు.. సందర్భం వచ్చినప్పుడల్లా, సోషల్‌ మీడియాలో తన సౌందర్య రహస్యాల్ని పంచుకుంటూ అమ్మాయిలందరికీ బ్యూటీ పాఠాలు నేర్పుతుంటుంది తమ్మూ.

తరువాయి

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

యూత్‌ కార్నర్

మరిన్ని

మంచిమాట


'స్వీట్' హోం

మరిన్ని

వర్క్‌ & లైఫ్

మరిన్ని

సూపర్‌ విమెన్

మరిన్ని