కొత్తది ప్రయత్నించే ముందు..
close
Published : 31/08/2021 00:48 IST

కొత్తది ప్రయత్నించే ముందు..

ఆకర్షించే ప్రకటన లేదా స్నేహితుల నుంచి మంచి రివ్యూ.. అమ్మాయిలను కొత్త సౌందర్య ఉత్పత్తులను ప్రయత్నించేలా ప్రోత్సహిస్తుంటాయి. మరి అవి మీకూ తగినవేనా? సరి చూసుకోవాలి. అదెలాగంటే..

ముందు మీ చర్మ తీరుపై అవగాహన ఏర్పరచుకోవాలి. తర్వాత కొనాలనుకునే ఉత్పత్తిలో వాడిన పదార్థాలేంటో చూసుకోవాలి. క్లెన్సర్‌, స్క్రబ్‌ వంటివి కడిగేస్తే సరిపోతాయి. కానీ సీరమ్‌, మాయిశ్చరైజర్‌ వంటివి చర్మంపై కొద్ది గంటలపాటు.. మళ్లీ ముఖం కడిగేంతవరకూ ఉండిపోతాయి. కాబట్టి వీటి పట్ల మరింత జాగ్రత్త వహించాలి.

ఫర్లేదు అనిపిస్తే ప్యాచ్‌ టెస్ట్‌ చేయాలి. అంటే కొద్ది మొత్తంలో క్రీమ్‌ను చేతికి రాసి, 24 గంటలపాటు అలాగే ఉంచాలి. దురద, ఎర్రదనం, దద్దుర్లు వంటివి లేకపోతే అప్పుడే ఉపయోగించాలి. స్కిన్‌ కేర్‌ రొటీన్‌ను సక్రమంగా అనుసరించడమూ ప్రధానమే. అలాగే సరైన ఫలితం రావాలనుకుంటే ప్రొడక్ట్‌పై ఉపయోగించమన్న తీరునీ పరిగణనలోకి తీసుకోవాలి.మరిన్ని

తమ్మూ బ్యూటీ సీక్రెట్స్ ఏంటో తెలుసా? 

ఉదయం లేవగానే కళ్లన్నీ వాచిపోయి, గాలిబుడగలా పఫ్ఫీగా తయారైన ముఖాన్ని చూసుకుంటే ఎక్కడలేని నిరుత్సాహం ఆవహిస్తుంది. ముందు రోజు పని ఒత్తిడి, నిద్రలేమి, తీసుకున్న ఆహారం.. తదితర కారణాల వల్ల ఈ సమస్య చాలామందిలో సహజమే! అయితే దీన్ని వదిలించుకోవాలంటే తానో సింపుల్‌ చిట్కాను పాటిస్తానంటోంది మిల్కీ బ్యూటీ తమన్నా. ఈ టిప్‌ అద్భుతంగా పనిచేస్తుందని స్వీయానుభవంతో చెబుతున్నానంటూ ఆ వీడియోను సైతం తాజాగా ఇన్‌స్టాలో పోస్ట్‌ చేసింది. ఇప్పుడనే కాదు.. సందర్భం వచ్చినప్పుడల్లా, సోషల్‌ మీడియాలో తన సౌందర్య రహస్యాల్ని పంచుకుంటూ అమ్మాయిలందరికీ బ్యూటీ పాఠాలు నేర్పుతుంటుంది తమ్మూ.

తరువాయి

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

యూత్‌ కార్నర్

మరిన్ని

మంచిమాట


'స్వీట్' హోం

మరిన్ని

వర్క్‌ & లైఫ్

మరిన్ని

సూపర్‌ విమెన్

మరిన్ని