ముత్యమంతా పసుపు...
close
Published : 01/09/2021 01:14 IST

ముత్యమంతా పసుపు...

శుభ సూచికగా పూజల్లోనూ, వంటింట్లోనూ వాడే పసుపులో సహజ ఔషధ గుణాలెన్నో పుష్కలంగా ఉంటాయి. దీని వల్ల ఆరోగ్యానికే కాదు... అందానికీ బోలెడంత మేలు.

మొటిమలు వాటి తాలూకు మచ్చలు చర్మాన్ని కాంతివిహీనంగా చేస్తాయి. ఇలాంటప్పుడు చెంచా పసుపు, రెండు చెంచాల గంధం పొడికి, కాసిన్ని పాలు కలిపి పేస్ట్‌లా చేసుకోవాలి. ఈ మిశ్రమంలో ముఖానికి ప్యాక్‌ వేసుకుని ఓ అరగంట తర్వాత గోరువెచ్చని నీళ్లతో కడిగేస్తే సరి. మోము మెరిసిపోతుంది. పసుపులో ఉండే యాంటీ సెప్టిక్‌, యాంటీ బ్యాక్టీరియల్‌ గుణాలు ఆ కారకాలతో పోరాడతాయి.

ముఖానికి ట్యాన్‌ పట్టినప్పుడు... కొద్దిగా పసుపు, చెంచా చొప్పున గులాబీపొడి, పెసరపిండిని తీసుకుని రోజ్‌వాటర్‌ కలిపి...పేస్ట్‌లా చేయాలి. దీన్ని రాత్రిళ్లు ప్యాక్‌ వేసి ఆరనిచ్చి కడిగేస్తే... ఉదయానికి ముఖం తాజాగా కనిపిస్తుంది.

కప్పు పెసరపిండిలో చిటికెడు పసుపు, అరకప్పు బొప్పాయి గుజ్జు, చెంచా గులాబీరేకల పొడి వేసి మెత్తగా పేస్ట్‌ చేయాలి. దీన్ని ముఖం, మెడ, చేతులకు రాసుకుంటే సరి. అరగంట తర్వాత కడిగితే... చర్మం మృదువుగా కనిపిస్తుంది. క్రమం తప్పకుండా ఇలా చేస్తే... ముడతలు, మృతకణాలు పోయి చర్మఛాయ మెరుగుపడుతుంది.మరిన్ని

తమ్మూ బ్యూటీ సీక్రెట్స్ ఏంటో తెలుసా? 

ఉదయం లేవగానే కళ్లన్నీ వాచిపోయి, గాలిబుడగలా పఫ్ఫీగా తయారైన ముఖాన్ని చూసుకుంటే ఎక్కడలేని నిరుత్సాహం ఆవహిస్తుంది. ముందు రోజు పని ఒత్తిడి, నిద్రలేమి, తీసుకున్న ఆహారం.. తదితర కారణాల వల్ల ఈ సమస్య చాలామందిలో సహజమే! అయితే దీన్ని వదిలించుకోవాలంటే తానో సింపుల్‌ చిట్కాను పాటిస్తానంటోంది మిల్కీ బ్యూటీ తమన్నా. ఈ టిప్‌ అద్భుతంగా పనిచేస్తుందని స్వీయానుభవంతో చెబుతున్నానంటూ ఆ వీడియోను సైతం తాజాగా ఇన్‌స్టాలో పోస్ట్‌ చేసింది. ఇప్పుడనే కాదు.. సందర్భం వచ్చినప్పుడల్లా, సోషల్‌ మీడియాలో తన సౌందర్య రహస్యాల్ని పంచుకుంటూ అమ్మాయిలందరికీ బ్యూటీ పాఠాలు నేర్పుతుంటుంది తమ్మూ.

తరువాయి

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

యూత్‌ కార్నర్

మరిన్ని

మంచిమాట


'స్వీట్' హోం

మరిన్ని

వర్క్‌ & లైఫ్

మరిన్ని

సూపర్‌ విమెన్

మరిన్ని