కండిషనర్‌ రాస్తున్నారా
close
Published : 06/09/2021 01:21 IST

కండిషనర్‌ రాస్తున్నారా

ఎన్ని రకాల ఉత్పత్తులు వాడుతున్నా జుట్టు రాలుతుంటే ఈ సహజ కండిషనింగ్‌ ప్యాక్‌లు వాడి చూడండి. ఫలితం ఉంటుంది. 

* రెండు గుడ్ల తెల్లసొనలో చెంచా చొప్పున ఆలివ్‌నూనె, వెనిగర్‌, తేనె వేసి బాగా కలపాలి. ఆపై దీన్ని జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకూ పట్టించాలి. ఆపై హెయిర్‌క్యాప్‌ పెట్టి, పది నిమిషాల తర్వాత గాఢత తక్కువగా ఉండే షాంపూతో తలస్నానం చేస్తే సరి.

* కప్పు అరటిపండు గుజ్జులో కొద్దిగా పాలు, చెంచా చొప్పున తేనె, ఆలివ్‌నూనె... గుడ్డు కలిపి బాగా మిక్స్‌ చేయాలి. ఈ మిశ్రమాన్ని తలకు ప్యాక్‌ వేస్తే మంచి కండిషనర్‌లా పనిచేస్తుంది. వెంట్రుకలు రాలే సమస్య తగ్గుతుంది.

* చెంచా కొబ్బరినూనెలో చెంచా చొప్పున తేనె, నిమ్మరసం, గులాబీనీరు, పెరుగు వేసి బాగా కలపాలి. తలస్నానం చేశాక ఈ మిశ్రమాన్ని జుట్టుకు రాసి రెండు నిమిషాల ఆగి మరోసారి చన్నీళ్లతో శుభ్రం చేస్తే చాలు.మరిన్ని

తమ్మూ బ్యూటీ సీక్రెట్స్ ఏంటో తెలుసా? 

ఉదయం లేవగానే కళ్లన్నీ వాచిపోయి, గాలిబుడగలా పఫ్ఫీగా తయారైన ముఖాన్ని చూసుకుంటే ఎక్కడలేని నిరుత్సాహం ఆవహిస్తుంది. ముందు రోజు పని ఒత్తిడి, నిద్రలేమి, తీసుకున్న ఆహారం.. తదితర కారణాల వల్ల ఈ సమస్య చాలామందిలో సహజమే! అయితే దీన్ని వదిలించుకోవాలంటే తానో సింపుల్‌ చిట్కాను పాటిస్తానంటోంది మిల్కీ బ్యూటీ తమన్నా. ఈ టిప్‌ అద్భుతంగా పనిచేస్తుందని స్వీయానుభవంతో చెబుతున్నానంటూ ఆ వీడియోను సైతం తాజాగా ఇన్‌స్టాలో పోస్ట్‌ చేసింది. ఇప్పుడనే కాదు.. సందర్భం వచ్చినప్పుడల్లా, సోషల్‌ మీడియాలో తన సౌందర్య రహస్యాల్ని పంచుకుంటూ అమ్మాయిలందరికీ బ్యూటీ పాఠాలు నేర్పుతుంటుంది తమ్మూ.

తరువాయి

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

యూత్‌ కార్నర్

మరిన్ని

మంచిమాట


'స్వీట్' హోం

మరిన్ని

వర్క్‌ & లైఫ్

మరిన్ని

సూపర్‌ విమెన్

మరిన్ని