ఉప్పు నీటితో జిడ్డు దూరం...
close
Updated : 15/09/2021 12:47 IST

ఉప్పు నీటితో జిడ్డు దూరం...

ముఖసౌందర్యాన్ని తగ్గించే జిడ్డును పోగొట్టాలంటే ఉప్పునీటిని ఉపయోగించాలంటున్నారు సౌందర్య నిపుణులు.

నాలుగు కప్పుల శుభ్రమైన నీటిలో రెండు చెంచాల నాన్‌ అయోడైజ్డ్‌ సాల్ట్‌ను కలిపి ముఖాన్ని కడిగితే చాలు. చర్మంలోని బ్యాక్టీరియాలను పీల్చడమే కాదు, మరిన్ని ప్రయోజనాలను అందిస్తుందని చెబుతున్నారు.

* మచ్చల్లేకుండా...  చర్మాన్ని బిగుతుగా చేసి చర్మరంధ్రాల్లో కలిగే పలు రకాల సమస్యలను ఉప్పునీళ్లు దూరం చేస్తాయి. ఈ రంధ్రాల్లో చేరే నూనెను పీల్చుకుని జిడ్డు లేకుండా చేస్తాయి. అలాగే చర్మంపై మొటిమలు రావడానికి కారణమయ్యే మృతకణాలను పోగొడతాయి. దీంతో మచ్చల్లేకుండా ముఖచర్మం ఆరోగ్యంగా ఉంటుంది.

* సమస్యల నుంచి...  ముఖం ఎక్కువగా పొడారిపోవడం లేదా సొరియాసిస్‌ వంటి సమస్యలుంటే ఉప్పు నీటితో శుభ్రం చేసుకుంటే చాలు. చర్మం మృదువుగా మారుతుంది. చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవాలంటే కనీసం రోజుకొకసారి ముఖాన్ని శుభ్రం చేసిన తర్వాత, కాస్త సీ సాల్ట్‌ కలిపిన నీటితో కడిగితే, ఇందులోని పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం వంటి పోషకాలు చర్మానికి ఆరోగ్యాన్ని అందిస్తాయి. అంతేకాదు, చర్మంలోని వ్యర్థాలను బయటికి పంపుతాయి.

* టోనర్‌గా... ఉప్పునీరు ముఖానికి ఫేషియల్‌ టోనర్‌గా ఉపయోగ పడుతుంది. మేకప్‌ వేసుకునే ముందు ముఖాన్ని ఉప్పునీటిలో ముంచిన మెత్తని వస్త్రంతో మృదువుగా అద్దుకోవాలి. ఇలా చేస్తే ముఖం మీది జిడ్డు తొలగిపోయి,  ఆ తర్వాత వేసే మేకప్‌ రోజంతా తాజాగా కనిపించేలా చేస్తుంది.

* లేపనాల్లో... ముఖానికి వేసే లేపనాల్లో ఉప్పునీటిని కలిపితే చర్మ రంధ్రాల్లో ఉండే నూనెను తొలగిస్తుంది. అంతేకాదు, చర్మాన్ని హైడ్రేట్‌ చేసి, ఆరోగ్యంగా మారుస్తుంది. మాయిశ్చరైజర్‌గానూ ఉపయోగపడుతుంది.

మరిన్ని

తమ్మూ బ్యూటీ సీక్రెట్స్ ఏంటో తెలుసా? 

ఉదయం లేవగానే కళ్లన్నీ వాచిపోయి, గాలిబుడగలా పఫ్ఫీగా తయారైన ముఖాన్ని చూసుకుంటే ఎక్కడలేని నిరుత్సాహం ఆవహిస్తుంది. ముందు రోజు పని ఒత్తిడి, నిద్రలేమి, తీసుకున్న ఆహారం.. తదితర కారణాల వల్ల ఈ సమస్య చాలామందిలో సహజమే! అయితే దీన్ని వదిలించుకోవాలంటే తానో సింపుల్‌ చిట్కాను పాటిస్తానంటోంది మిల్కీ బ్యూటీ తమన్నా. ఈ టిప్‌ అద్భుతంగా పనిచేస్తుందని స్వీయానుభవంతో చెబుతున్నానంటూ ఆ వీడియోను సైతం తాజాగా ఇన్‌స్టాలో పోస్ట్‌ చేసింది. ఇప్పుడనే కాదు.. సందర్భం వచ్చినప్పుడల్లా, సోషల్‌ మీడియాలో తన సౌందర్య రహస్యాల్ని పంచుకుంటూ అమ్మాయిలందరికీ బ్యూటీ పాఠాలు నేర్పుతుంటుంది తమ్మూ.

తరువాయి

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

యూత్‌ కార్నర్

మరిన్ని

మంచిమాట


'స్వీట్' హోం

మరిన్ని

వర్క్‌ & లైఫ్

మరిన్ని

సూపర్‌ విమెన్

మరిన్ని