ఇంపైన చర్మానికి కుంకుమపువ్వు...
close
Updated : 17/09/2021 01:15 IST

ఇంపైన చర్మానికి కుంకుమపువ్వు...

విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండే కుంకుమపువ్వు.. చర్మాన్ని మెరిసేలా చేయగలదు. చర్మసౌందర్యాన్ని పెంచడంలో దీనికి ప్రత్యేక స్థానం ఉందంటున్నారు సౌందర్యనిపుణులు. దీనిలోని యాంటీ ఫంగల్‌ గుణాలు మచ్చలను దూరం చేస్తాయని చెబుతున్నారు..

* టోనర్‌గా.. కప్పు రోజ్‌వాటర్‌లో పావుచెంచా కుంకుమపువ్వును పావుగంట నానబెట్టి దాన్ని ముఖానికి టోనర్‌గా వినియోగించాలి. ఇది చర్మాన్ని మృదువుగా మార్చడమే కాకుండా, మేకప్‌ను ఎక్కువ సమయం తాజాగా ఉండేలా చేస్తుంది. అలాగే మేకప్‌ను తొలగించిన తర్వాత ఈ నీటితో ముఖాన్ని మృదువుగా అద్దుకుని ఆరనిస్తే చాలు. చర్మం సహజమెరుపును సంతరించుకుంటుంది.

* మసాజ్‌గా... చెంచా తేనెలో రెండు కుంకుమ పూరేకలను నానబెట్టి మెత్తగా చేయాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి మృదువుగా అప్లై చేసి మర్దనా చేస్తే చర్మంలో ఇంకిపోతుంది. ఇది రక్తసరఫరాను మెరుగుపరిచి, ముఖచర్మానికి కొత్త కాంతినిస్తుంది. చెంచా పచ్చిపాలల్లో ఈ పూరేకలు నాలుగింటిని వేయాలి. దీనికి చెంచా గంధం కలిపి మెత్తని మిశ్రమంలా చేసి ముఖానికి అప్లై చేసి తడీపొడిగా ఉన్నప్పుడు మృదువుగా పావుగంటసేపు మర్దన చేసి గోరువెచ్చని నీటితో కడిగితే చాలు. అలాగే కొన్ని తులసి ఆకులను, నాలుగైదు కుంకుమపువ్వు రేకలను నీటిలో నానబెట్టి మెత్తగా ముద్దలా చేసి మర్దనా చేసినా.. ముఖచర్మం మెరుపులీనుతుంది.

* లేపనంగా... నాలుగు కుంకుమపూరేకలను చెంచా పాలల్లో గంటసేపు నాననివ్వాలి. దీనికి అరచెంచా నిమ్మరసం, రాత్రంతా నీటిలో నానబెట్టి మెత్తగా ముద్దలా చేసిన చెంచా పొద్దుతిరుగుడు విత్తనాల మిశ్రమాన్ని కలిపి ముఖానికి లేపనంగా రాయాలి. 20 నిమిషాలు ఆరనిచ్చి శుభ్రంగా కడిగితే చాలు. ముఖంపై ఎండవల్ల ఏర్పడిన మచ్చలు మటుమాయమవుతాయి. అంతేకాదు, మొటిమలూ రావు.


Advertisement


మరిన్ని

తమ్మూ బ్యూటీ సీక్రెట్స్ ఏంటో తెలుసా? 

ఉదయం లేవగానే కళ్లన్నీ వాచిపోయి, గాలిబుడగలా పఫ్ఫీగా తయారైన ముఖాన్ని చూసుకుంటే ఎక్కడలేని నిరుత్సాహం ఆవహిస్తుంది. ముందు రోజు పని ఒత్తిడి, నిద్రలేమి, తీసుకున్న ఆహారం.. తదితర కారణాల వల్ల ఈ సమస్య చాలామందిలో సహజమే! అయితే దీన్ని వదిలించుకోవాలంటే తానో సింపుల్‌ చిట్కాను పాటిస్తానంటోంది మిల్కీ బ్యూటీ తమన్నా. ఈ టిప్‌ అద్భుతంగా పనిచేస్తుందని స్వీయానుభవంతో చెబుతున్నానంటూ ఆ వీడియోను సైతం తాజాగా ఇన్‌స్టాలో పోస్ట్‌ చేసింది. ఇప్పుడనే కాదు.. సందర్భం వచ్చినప్పుడల్లా, సోషల్‌ మీడియాలో తన సౌందర్య రహస్యాల్ని పంచుకుంటూ అమ్మాయిలందరికీ బ్యూటీ పాఠాలు నేర్పుతుంటుంది తమ్మూ.

తరువాయి

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

యూత్‌ కార్నర్

మరిన్ని

మంచిమాట


'స్వీట్' హోం

మరిన్ని

వర్క్‌ & లైఫ్

మరిన్ని

సూపర్‌ విమెన్

మరిన్ని