అందమైన అధరాలకు...
close
Updated : 25/09/2021 05:33 IST

అందమైన అధరాలకు...

ఆరోగ్యమైన చర్మం కోసం ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటుంటాం. చక్కని ముఖంలో పెదవులదీ ప్రధాన పాత్రే. వాటిని అశ్రద్ధ చేస్తే.. అందం పూర్తవదు. వాటి విషయంలోనూ శ్రద్ధ చూపండిలా!

పెదాలపై నూనె గ్రంథులుండవు. కాబట్టి, వాటికి తగిన తేమ మనమే అందించాలి. దీని చర్మం చాలా సున్నితంగా ఉంటుంది. కొలాజెన్‌ తగ్గితే త్వరగా ముడతలు పడుతుంది. ఇందుకు ఎస్‌పీఎఫ్‌ 30 లిప్‌బామ్‌ను తప్పక వాడాలి. అలాగే దీనిలో షియా బటర్‌, విటమిన్‌ ఇ, జొజొబా, కొబ్బరి, రోజ్‌/ లావెండర్‌ నూనెలు, బీ వ్యాక్స్‌ వంటివి ఉండేలా చూసుకోండి. 

* ఆరోగ్యమైన, సహజ రంగులో అధరాలుండాలంటే వారానికోసారి గ్లిజరిన్‌లో నిమ్మరసం కలిపి పెదాలకు రాయండి. మృతకణాలను తొలగించడంతోపాటు మంచి రంగూ వస్తుంది. స్పూను తేనెలో పంచదారను కలిపి సున్నితంగా రుద్దినా ఫలితముంటుంది. లిప్‌స్టిక్‌ అలవాటున్న వాళ్లు మొదట లిప్‌బామ్‌ రాశాకే దాన్ని పూతగా వేయండి. ఫలితంగా పెదాలు పొడారవు.

* అలర్జీలు, ఎండపొడ, ఐరన్‌ లోపం మొదలైనవి పాలిన పెదాలకు కారణమవుతాయి. వీటికి తగిన చికిత్సతోపాటు మంచి లిప్‌స్క్రబ్‌ వాడాలి. అలోవెరా గుజ్జును పెదాలకు రాసి, పది నిమిషాల తర్వాత కడిగేసినా ఫలితముంటుంది.మరిన్ని

తమ్మూ బ్యూటీ సీక్రెట్స్ ఏంటో తెలుసా? 

ఉదయం లేవగానే కళ్లన్నీ వాచిపోయి, గాలిబుడగలా పఫ్ఫీగా తయారైన ముఖాన్ని చూసుకుంటే ఎక్కడలేని నిరుత్సాహం ఆవహిస్తుంది. ముందు రోజు పని ఒత్తిడి, నిద్రలేమి, తీసుకున్న ఆహారం.. తదితర కారణాల వల్ల ఈ సమస్య చాలామందిలో సహజమే! అయితే దీన్ని వదిలించుకోవాలంటే తానో సింపుల్‌ చిట్కాను పాటిస్తానంటోంది మిల్కీ బ్యూటీ తమన్నా. ఈ టిప్‌ అద్భుతంగా పనిచేస్తుందని స్వీయానుభవంతో చెబుతున్నానంటూ ఆ వీడియోను సైతం తాజాగా ఇన్‌స్టాలో పోస్ట్‌ చేసింది. ఇప్పుడనే కాదు.. సందర్భం వచ్చినప్పుడల్లా, సోషల్‌ మీడియాలో తన సౌందర్య రహస్యాల్ని పంచుకుంటూ అమ్మాయిలందరికీ బ్యూటీ పాఠాలు నేర్పుతుంటుంది తమ్మూ.

తరువాయి

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

యూత్‌ కార్నర్

మరిన్ని

మంచిమాట


'స్వీట్' హోం

మరిన్ని

వర్క్‌ & లైఫ్

మరిన్ని

సూపర్‌ విమెన్

మరిన్ని