పాదాలు పదిలంగా...
close
Published : 27/09/2021 00:29 IST

పాదాలు పదిలంగా...

ముఖం, చేతులు... వంటి వాటిపై చూపిన శ్రద్ధ పాదాలపై పెట్టం. ఇక ముందు అలా చేయకండి. పార్లర్‌లో అందే పెడిక్యూర్‌ ఫలితాల్ని ఇంట్లోనే ఇలా పొందండి..

* నిద్రపోయే ముందు పావు కప్పుకొబ్బరి నూనెలో రెండు చుక్కల లవంగ నూనె చేర్చి పాదాలకు రాసి బాగా మర్దన చేయండి. ఇలా రోజూ చేస్తుంటే రక్తప్రసరణ సక్రమంగా జరిగి ఆరోగ్యంగా ఉంటాయి.

* బొప్పాయి గుజ్జులో చెంచా నువ్వుల నూనె, కొద్దిగా పెసరపిండి, కాస్త పెరుగు కలపాలి. ఈ మిశ్రమాన్ని  పాదాలకు పూత వేసి అరగంటయ్యాక కడిగేస్తే కాంతిమంతంగా కనిపిస్తాయి.

* గుప్పెడు గులాబీ రేకలు, రెండు తులసి రెమ్మలు, చెంచా ఆలివ్‌ నూనె నీళ్లల్లో వేసి మరగ బెట్టాలి. గోరువెచ్చగా అయ్యాక కాసేపు అందులో పాదాలను నాననివ్వండి. ఆపై ప్యూమిక్‌ స్టోన్‌తో రుద్దితే మృతచర్మం తొలగి కోమలంగా మారతాయి.మరిన్ని

తమ్మూ బ్యూటీ సీక్రెట్స్ ఏంటో తెలుసా? 

ఉదయం లేవగానే కళ్లన్నీ వాచిపోయి, గాలిబుడగలా పఫ్ఫీగా తయారైన ముఖాన్ని చూసుకుంటే ఎక్కడలేని నిరుత్సాహం ఆవహిస్తుంది. ముందు రోజు పని ఒత్తిడి, నిద్రలేమి, తీసుకున్న ఆహారం.. తదితర కారణాల వల్ల ఈ సమస్య చాలామందిలో సహజమే! అయితే దీన్ని వదిలించుకోవాలంటే తానో సింపుల్‌ చిట్కాను పాటిస్తానంటోంది మిల్కీ బ్యూటీ తమన్నా. ఈ టిప్‌ అద్భుతంగా పనిచేస్తుందని స్వీయానుభవంతో చెబుతున్నానంటూ ఆ వీడియోను సైతం తాజాగా ఇన్‌స్టాలో పోస్ట్‌ చేసింది. ఇప్పుడనే కాదు.. సందర్భం వచ్చినప్పుడల్లా, సోషల్‌ మీడియాలో తన సౌందర్య రహస్యాల్ని పంచుకుంటూ అమ్మాయిలందరికీ బ్యూటీ పాఠాలు నేర్పుతుంటుంది తమ్మూ.

తరువాయి

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

యూత్‌ కార్నర్

మరిన్ని

మంచిమాట


'స్వీట్' హోం

మరిన్ని

వర్క్‌ & లైఫ్

మరిన్ని

సూపర్‌ విమెన్

మరిన్ని