కరోనా నుంచి అమ్మను కాపాడుకుందాం!
close
Published : 19/02/2021 15:19 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కరోనా నుంచి అమ్మను కాపాడుకుందాం!

ప్రపంచమంతా ‘కొవిడ్‌-19’ నీలినీడలు కమ్ముకున్నాయి. మనదేశంలో చాప కింద నీరులా విస్తరిస్తోన్న ఈ వైరస్‌ ప్రజల్ని మరింత భయభ్రాంతులకు గురిచేస్తోంది. ఆరోగ్యవంతులే ఈ వైరస్‌ ధాటికి డీలా పడిపోతున్నారంటే.. ఇక రోగనిరోధక శక్తి తక్కువగా ఉండే గర్భిణులు, పిల్లలు, వృద్ధుల పరిస్థితి చెప్పక్కర్లేదు. ముఖ్యంగా గర్భిణులు ఈ వైరస్‌ బారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం.

సార్స్‌, మెర్స్‌.. ఈ రెండు కరోనా వైరస్‌ల ప్రభావం గర్భవతుల మీద తీవ్రంగా ఉంటుంది. ఇప్పటి వరకు అయితే కొవిడ్‌ వచ్చిన గర్భవతుల్లో సాధారణ వ్యక్తులకు వచ్చిన సమస్యలే వచ్చాయి. ఇది గర్భవతుల్లో విపరీతమైన పరిణామాలకు దారితీస్తుందనే దాఖలాలు లేవు. చైనాలోని వూహాన్‌లో వెలుగుచూసిన కేసుల ప్రకారం.. గర్భవతుల్లో ఈ జబ్బు వచ్చినప్పుడు గర్భస్రావాలు, నెలలు నిండని కాన్పులు.. వంటివి ఎక్కువగా కనిపించాయి. అలాగే గర్భస్థ శిశువుకు ప్రాణ వాయువు సరఫరా తగ్గడం వల్ల శిశువు గర్భంలోనే మరణించడం లేదా ఫీటల్‌ డిస్టెస్ర్‌కు (అస్వస్థతకు) లోనుకావడం జరగవచ్ఛు

‘కొవిడ్‌-19’ రాకుండా ఉండాలంటే..!

* గర్భవతులందరూ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఈ వారంలోనే ఈ వ్యాధి విపరీతంగా ప్రబలే అవకాశాలున్నాయి.

* వీలైనంత వరకు ఇంట్లో నుంచి బయటికి వెళ్లకూడదు.

* ఈ వైరస్‌ సోకిన వ్యక్తులకు దూరంగా ఉండాలి.

* వ్యాధి లక్షణాలు కనిపించిన వెంటనే సంబంధిత నిపుణుల్ని సంప్రదించాలి.

* ఈ వైరస్‌ రోజుల తరబడి శరీరం బయట కూడా జీవించగలదు. ఏది ముట్టుకున్నా చేతులు కడుక్కోవడం తప్పనిసరి. బయటి నుంచి తెచ్చిన వస్తువులు శరీరానికి, ముఖానికి తగలకుండా చూసుకోవాలి.

* ప్రయాణాలకు దూరంగా ఉండటం, వీలైనంత వరకు ఇంట్లో వండిన ఆహారాన్నే తీసుకోవడం, మాస్కులు ధరించడం, సామాజిక దూరం... వంటివన్నీ తప్పనిసరిగా పాటించాలి.

* దీనికి వ్యాక్సిన్‌ అందుబాటులో లేదు. కాబట్టి తల్లి తనను, తన బిడ్డను ఈ వ్యాధి బారి నుంచి రక్షించుకోవాలంటే పైన చెప్పిన జాగ్రత్తలన్నీ తప్పకుండా పాటించాలి.

వైరస్‌ సోకిన గర్భవతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు...●

* ‘కొవిడ్‌-19’ వ్యాధి సోకి కాన్పు సమయం దగ్గర పడిన స్త్రీని ఐసోలేషన్‌/క్వారంటైన్‌లో ఉంచాలి.

* అవసరమైనప్పుడు ఆక్సిజన్‌ను తప్పనిసరిగా అందించాలి.

* సెకండరీ బ్యాక్టీరియల్‌ ఇన్ఫెక్షన్‌... అంటే ఈ వైరస్‌ పైన తిరిగి బ్యాక్టీరియల్‌ ఇన్ఫెక్షన్‌ వంటివి రాకుండా యాంటీబయోటిక్స్‌ ఇవ్వాలి.

* తల్లినీ బిడ్డనీ క్షుణ్నంగా పర్యవేక్షించాలి.

* కాన్పు విషయానికొస్తే.. మామూలు గర్భవతికి ఏ రకంగా అయితే డెలివరీ చేయాలనుకుంటారో కొవిడ్‌-19 బాధితులకు కూడా అదే విధంగా నిర్ణయిస్తారు.

* ఈ వైరస్‌ సోకిన వారందరికీ సిజేరియన్‌ చేయాల్సిన అవసరం లేదు. అందుకు ప్రత్యేకమైన కారణాలుంటేనే చేయాలి.

* అన్ని రకాల సదుపాయాలున్న మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రుల్లోనే కాన్పు జరగాలి. ఈ క్రమంలో స్త్రీల వైద్య నిపుణులు, శ్వాసకోశ, మూత్రపిండాలు-గుండె సంబంధిత, పిల్లల వైద్య నిపుణులు... కాన్పు జరిగే సమయంలో అందుబాటులో ఉండాలి.

‘కొవిడ్‌-19’ని గుర్తించడమెలా?

కరోనా వైరస్‌ను రక్త పరీక్ష చేయడం ద్వారా గుర్తించవచ్ఛు దీని బారిన పడిన వారిలో తెల్లరక్తకణాలు, లింఫోసైట్లు, ప్లేట్‌లెట్లు తగ్గుతాయి. ఊపిరితిత్తుల పనితీరును పరిశీలించడానికి సాధారణ ఎక్స్‌రే నుంచి సిటీ స్కాన్‌ వరకు చేయాల్సి రావచ్ఛు ఇలాంటి ఎక్స్‌రేలు తీసేటప్పుడు కడుపులోని బిడ్డకు ఈ కిరణాలు తాకకుండా ప్రొటెక్టివ్‌ షీల్డ్స్‌ (రక్షణ కవచాలు) ఉండేలా చూసుకోవాలి.

చికిత్స ఎలా ఉంటుంది?

‘కొవిడ్‌-19’ లక్షణాలను బట్టే చికిత్స చేయాల్సి ఉంటుంది. కచ్చితంగా ఏ మందులూ ఈ వైరస్‌పై ప్రభావం చూపుతాయని ఇప్పటివరకు తేలలేదు. సాధారణ ఫ్లూకి వాడే మందుల దగ్గర్నుంచి... హెచ్‌ఐవీ బాధితులకు ఇచ్చే వివిధ రకాల యాంటీ వైరల్‌ మందులతోనే చికిత్స చేస్తున్నారు. అయితే ఈ మందులు కొవిడ్‌-19 మీద ఎంత వరకు ప్రభావం చూపుతాయనేది మనకింకా కచ్చితంగా తెలియదు.

పుట్టిన పాపాయికి రక్షణ...

కరోనా వైరస్‌ తల్లి నుంచి బిడ్డకు నేరుగా సోకదు. బాధితుల వల్ల ఎలాగైతే చుట్టూ ఉన్న వారందరికీ ఈ వైరస్‌ వ్యాపిస్తుందో... బిడ్డకూ తల్లి నుంచి అలానే వచ్చే అవకాశం ఉంటుంది. అందుకని బిడ్డను తల్లి నుంచి దూరంగా ఉంచడం, పాలిచ్చేటప్పుడు తల్లి మాస్కులు ధరించడం, చేతులు శుభ్రం చేసుకున్న తర్వాతే బిడ్డను ముట్టుకోవడం... లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. తల్లిపాలలో ఈ వైరస్‌ ఉండే అవకాశం లేదు. ఈ జాగ్రత్తలన్నీ తీసుకుంటూ తల్లి బిడ్డకు నిశ్చింతగా పాలివ్వచ్ఛు

మరిన్ని వివరాలకు వసుంధర.నెట్‌ చూడండి


మరిన్ని

అనుబంధం

మరిన్ని

యూత్ కార్నర్

మరిన్ని

'స్వీట్' హోం

మరిన్ని

వర్క్ & లైఫ్

మరిన్ని

సూపర్ విమెన్

మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని