పనిలోనే కసరత్తులు చేసేద్దాం!
close
Published : 12/03/2021 14:28 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

పనిలోనే కసరత్తులు చేసేద్దాం!

ఇల్లాలిగా...ఇంటిపనులు చేయడంతోనే తీరిక ఉండటం లేదు. ఇక వ్యాయామానికి సమయం ఎక్కడ కేటాయిస్తారు అంటారు చాలామంది మహిళలు. అలాంటప్పుడు ఇంటినే జిమ్‌గా మార్చేసుకోండి. అదెలాగంటారా?
ఉదయం లేచిన వెంటనే పని మొదలుపెట్టేయొద్దు. శరీరం మొత్తం సాగేలా స్ట్రెచ్‌ చేయండి. కనీసం నాలుగైదు సార్లు ప్రశాంతంగా మేడమెట్లు ఎక్కిదిగండి. టెర్రస్‌పైనో, పెరట్లోనో ఉన్నమొక్కలకు నీళ్లుపట్టండి. కాస్త శరీరానికి శ్రమ అందుతుంది. ఆపై చక్కగా ఓ గ్రీన్‌టీ ఆస్వాదించి...మీ రొటీన్‌లోకి వెళ్లిపోండి.
* రోజులో కనీసం నలభై ఐదు నిమిషాలు కసరత్తులకు కేటాయించుకుంటే చాలు. ప్రతి పది నుంచి ఇరవై సెకన్ల సమయం విరామం తీసుకుంటూ ఒక్కో తరహా వ్యాయామానికి ఒక్కో ఇంటిపనిని ఎంచుకోండి. ఒత్తిడిని వదిలిపెట్టి వీటిని పూర్తి చేయండి. వేగంగా నడవడం, నడుము వంచి పనిచేయడం వంటివన్నీ మేలు చేసేవే.  
* కిందనున్న వస్తువుని పైన పెట్టాలన్నా...పైన ఉన్న వస్తువుని కిందకు దింపాలన్నా కూడా వేగంగా ఒకటికి రెండు సార్లు ఆ పని చేయండి. స్క్వాట్‌ చేసిన ఫలితం అందుతుంది. మునివేళ్లపై నిలబడి పైనున్న వస్తువుల్ని అందుకోవడానికి ప్రయత్నించండి. దీనివల్ల శరీరాన్ని బ్యాలెన్స్‌ చేసుకోగలరు. ఇలా చేయడం వల్ల కాలి కండరాలతో పాటు పొట్ట కండరాలూ చురుగ్గా స్పందిస్తాయి. అదనంగా పేరుకున్న కొవ్వూ కరిగిపోతుంది.


మరిన్ని

అనుబంధం

మరిన్ని

యూత్ కార్నర్

మరిన్ని

'స్వీట్' హోం

మరిన్ని

వర్క్ & లైఫ్

మరిన్ని

సూపర్ విమెన్

మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని