ఒంటి నొప్పులు మాయం!
close
Published : 14/03/2021 15:45 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఒంటి నొప్పులు మాయం!

ఎక్కువసేపు కదలకుండా కూర్చొని పనిచేసేవాళ్లు నడుము, కాళ్ల నొప్పులతో ఇబ్బందిపడుతుంటారు. అలాంటివాళ్లు ఈ సమకోణాసనాలను సాధన చేయడం వల్ల ఫలితం ఉంటుంది. వీటివల్ల నొప్పులు తగ్గడంతోపాటు కండరాలూ బలోపేతమవుతాయి.

నిలబడి శ్వాస తీసుకుంటూ చేతులను ముందుకు చాపాలి. ఇప్పుడు కాళ్లను వంచకుండా నడుము మాత్రమే వంచాలి. తర్వాత నడుమును మెల్లగా కుడివైపు తిప్పాలి. ఈ స్థితిలో పది నుంచి ఇరవై సెకన్లపాటు ఉండాలి. ఎడమవైపు తిరిగి ఇలాగే చేయాలి. తర్వాత మెల్లగా చేతులను ముందుకు చాపి యథా స్థానానికి వచ్చేయాలి.

నిటారుగా నిలబడి ఫొటోలో చూపినట్టుగా తలను ముందుకు వంచాలి. చేతులను తొంభై డిగ్రీల కోణంలో పైకి లేపాలి. మోకాళ్లను కొద్దిగా వంచి అక్కడ తలను ఉంచాలి. ఈ స్థితిలో పది నుంచి ఇరవై సెకన్లపాటు ఉండి మెల్లగా తలను పైకి లేపాలి. ముందుగా చేతులను కిందకు దించి తర్వాత శరీరాన్ని పైకి లేపాలి. ఐదారుసార్లు ఇలా సాధన చేయాలి.

పాదాలను దగ్గరగా పెట్టి నిలబడాలి. చేతులను పైకి లేపి ముందుకు చాపి కట్టుకోవాలి. నడుమును వీలైనంత వంచి కాళ్లను నిటారుగా ఉంచాలి. పాదాల వేళ్లను మాత్రం పైకి లేపి ఉంచాలి. ఈ స్థితిలో అర నిమిషంపాటు ఉండాలి. దీన్ని మూడు నుంచి ఆరుసార్లు సాధన చేయాలి. ఈ వ్యాయామంతో మెడ, కాళ్ల నొప్పుల నుంచి ఉపశమనం పొందొచ్చు. తీవ్రమైన నడుము నొప్పితో బాధపడుతున్న వాళ్లు మాత్రం ఈ వ్యాయామం చేయకూడదు.

నిలబడి రెండు చేతులను ఫొటోలో చూపించిన విధంగా నడుము మీద పెట్టుకోవాలి. శ్వాస తీసుకుంటూ వెనక్కు వంగాలి. పది సెకన్లపాటు ఈ స్థితిలో ఉండి యథాస్థితికి వచ్చేయాలి. దీన్ని మూడు నుంచి ఆరుసార్లు చేయాలి. దీంతో నడుము నొప్పి తగ్గుతుంది.


మరిన్ని

అనుబంధం

మరిన్ని

యూత్ కార్నర్

మరిన్ని

'స్వీట్' హోం

మరిన్ని

వర్క్ & లైఫ్

మరిన్ని

సూపర్ విమెన్

మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని