తాగేద్దాం.. చల్లచల్లగా.. పుదీనా!
close
Published : 16/03/2021 18:48 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

తాగేద్దాం.. చల్లచల్లగా.. పుదీనా!

ఈ కాలంలో ఎన్ని నీళ్లు తాగినా... దాహం తీరదు. ఎండలకు నీరసపడిపోతాం. అలాంటప్పుడు అస్తమానూ నీళ్లు కాకుండా పోషకాలుండే ద్రవాలనూ తాగాలి. అందులో పుదీనా రసం ఒకటి.
దీన్ని తాగితే హాయిగా ఉంటుంది. తయారుచేయడమూ సులువే. శరీరానికి కావాల్సిన లవణాలు, పోషకాలను అందిస్తుంది పుదీనా.
* గుప్పెడు పుదీనా ఆకులను బాగా కడిగి.. గ్లాసు నీళ్లు పోసి మిక్సీ పట్టాలి. దీంట్లో కొద్దిగా పంచదార, చిటికెడు ఉప్పు, చెంచా నిమ్మరసం కలపాలి. చక్కెర బదులుగా తేనె కూడా వేసుకోవచ్చు.  చివరగా ఐస్‌క్యూబ్స్‌ వేసుకుంటే చల్లని పుదీనా రసం సిద్ధమవుతుంది.
లాభాలు...
* దీంట్లోని బోలెడు పోషకాలు శక్తినిస్తాయి. దాంతో శరీరం డీహైడ్రేషన్‌కు గురికాకుండా ఉంటుంది. ఈ రసం క్రమం తప్పకుండా తీసుకుంటే జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది. దాంతో మలబద్ధకం సమస్య కూడా ఉత్పన్నం కాదు.


మరిన్ని

అనుబంధం

మరిన్ని

యూత్ కార్నర్

మరిన్ని

'స్వీట్' హోం

మరిన్ని

వర్క్ & లైఫ్

మరిన్ని

సూపర్ విమెన్

మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని