Corona: కొవిడ్‌ నుంచి కోలుకున్నాక..
close
Published : 06/06/2021 06:38 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Corona: కొవిడ్‌ నుంచి కోలుకున్నాక..

కరోనాకు హోం ఐసోలేషన్‌ ద్వారా చికిత్స తీసుకుంటున్నవారే ఎక్కువ. కానీ కోలుకున్న తర్వాత వారున్న గదినీ, వాడిన వస్తువులనూ తప్పక శుభ్రం చేయాలంటున్నారు నిపుణులు. అదెలాగంటే..
* 20 లీటర్ల నీటిలో రెండు, మూడు టేబుల్‌ స్పూన్ల బ్లీచింగ్‌ పౌడర్‌ను కలపాలి. దానిని ఒక స్ప్రే బాటిల్‌లో పోసి రోగి ఉన్న గదినిండా చల్లాలి. దాన్ని కొన్ని రోజులపాటు వాడకుండా ఉంటే మంచిది. మంచాన్ని డెటాల్‌తో ముంచిన గుడ్డతో తుడవాలి. ప్లాస్టిక్‌ కుర్చీలను డిస్‌ఇన్ఫెక్టెంట్‌ లిక్విడ్‌ స్ప్రే చేసి, ఎండలో ఉంచొచ్చు.
* వారు ఉపయోగించిన బట్టలు, కర్టెన్లు, దుప్పట్లను నేరుగా వాషింగ్‌ మెషిన్‌లో ఉతికేయొద్దు. వేడి నీటిలో గంటపాటు నానబెట్టి, ఆపై ఉతికి, ఎండలో ఆరేయాలి. గది గడియలు, నాబ్‌లు, ట్యాప్‌లు, డోర్లను డెటాల్‌ లేదా సబ్బు నీటితో శుభ్రం చేయాలి.
* ఆ సమయంలో ఉపయోగించిన మాస్క్‌లు, టూత్‌ బ్రష్‌, టంగ్‌ క్లీనర్‌, సబ్బులు, గ్లౌజులు మొదలైనవి తీసేయడం మేలు. గ్యాడ్జెట్లు, ఇయర్‌ఫోన్‌, చార్జర్‌, మౌస్‌లనూ తప్పక శుభ్రపరచాలి. గ్యాడ్జెట్‌ కవర్లను శుభ్రపరచడం కంటే తీసేయడం మేలు.
* ఈ సమయంలో గ్లౌజులు, తలకు క్యాప్‌ ధరించడం మర్చిపోవద్దు. శుభ్రం చేయడానికి ఉపయోగించిన వస్త్రాలు, స్క్రబ్‌లు మొదలైనవాటిని కవర్‌లో ఉంచి, సీల్‌ చేసి పడేయాలి. పూర్తయ్యాక చేతులు తప్పక శానిటైజ్‌ చేయాలి. ఆపై స్నానం చేసేయాలి. వేసుకున్న బట్టలను వేడినీటిలో నానబెట్టి, ఉతికేయాలి. ఇప్పుడు ఎన్నో సంస్థలూ కొంత మొత్తం తీసుకుని హోం శానిటైజేషన్‌ చేసిపెడుతున్నాయి. వాటి సాయమూ తీసుకోవచ్చు.


మరిన్ని

అనుబంధం

మరిన్ని

యూత్ కార్నర్

మరిన్ని

'స్వీట్' హోం

మరిన్ని

వర్క్ & లైఫ్

మరిన్ని

సూపర్ విమెన్

మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని