వీటికి బెల్లాన్ని కలిపి తింటే...
close
Published : 10/06/2021 00:54 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

వీటికి బెల్లాన్ని కలిపి తింటే...

శరీరానికి కావాల్సిన కాల్షియం, మెగ్నీషియం, ఐరన్‌, పొటాషియం, ఫాస్ఫరస్‌ వంటి ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు బెల్లంలో పుష్కలంగా ఉంటాయి. దీన్ని కొన్ని పదార్థాలతో కలిపి తీసుకుంటే పిల్లలు, మహిళలకు ఎన్నో ఉపయోగాలున్నాయంటున్నారు నిపుణులు. అవేంటో చూద్దాం..
పప్పులతో... వేయించిన సెనగపప్పుకు బెల్లం పొడిని కలిపి ఉండలు చేసి రోజుకొకటి తీసుకుంటే చాలా మంచిది. ఈపప్పులోని విటమిన్లు, పీచు, ప్రొటీన్లు, బెల్లంలోని పోషకాలతో కలిసి కండరాలను బలోపేతం చేస్తాయి. తక్కువ కెలోరీలతో ఎక్కువ శక్తినీ ఇస్తాయి. వేరుసెనగపప్పును విడిగా కన్నా, కొంచెం బెల్లాన్ని కలిపి తినాలి. వేరుశనగలోని ఫోలిక్‌ యాసిడ్‌, ప్రొటీన్లు బెల్లంలోని ఐరన్‌, కాల్షియంతో కలిసి వ్యాధినిరోధక శక్తిని పెంచుతాయి. నెలసరి సమస్యలకు చెక్‌ పెడతాయి. శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపడానికీ తోడ్పడతాయి.
*పసుపు కలిపి... బెల్లాన్ని కొంచెం వేడిచేసి, అందులో చిటికెడు పసుపు వేసి ఉండలుగా చుట్టాలి. వీటిని శుభ్రపరిచిన గాజుసీసాలో భద్రపరిచి, రోజూ ఉదయం అల్పాహారం తర్వాత ఒకటి తీసుకుంటే చాలు. ఇది వ్యాధినిరోధక శక్తిని పెంచడమే కాకుండా, వ్యర్థాలను వెలుపలకు పంపుతుంది. వాతావరణానికి తగ్గట్లుగా శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. వీటిని పిల్లలతోనూ తినిపించొచ్చు.
* గోరువెచ్చగా... గ్లాసు నీటిని వేడిచేసి చిటికెడు బెల్లం పొడి వేసి పర గడుపున తీసుకుంటే జీవక్రియలు సక్రమంగా జరుగుతాయి. ఇలా రోజూ చేస్తే ఎసిడిటీని పూర్తిగా నియంత్రిస్తుంది. కడుపు ఉబ్బరం వంటి సమస్యలనూ దూరం చేస్తుంది. గోరువెచ్చని నెయ్యిలో సమానంగా బెల్లంపొడిని వేసి ఉండలుగా చుట్టి భద్రపరుచుకోవాలి. రోజూ ఒకటి చొప్పున తీసుకుంటే శరీరం నుంచి టాక్సిన్స్‌ను బయటికి గెంటేయడమే కాకుండా ఎసిడిటీనీ తగ్గిస్తుంది.


మరిన్ని

యోగాలో ఈ పొరపాట్లు దొర్లకుండా..!

మానసిక ఒత్తిడి, టెన్షన్ల నుంచి తక్షణమే విముక్తి లభిస్తే బాగుండు.. అనిపిస్తోందా? అధిక పనితో అలసిపోయిన శరీరాన్ని శక్తిమంతం చేసుకోవాలనుకుంటున్నారా? ఇవన్నీ ఒకేసారి సాధ్యమైతే.. అంతకంటే ఆనందమేముంటుంది చెప్పండి.. అటు శారీరకంగా, ఇటు మానసికంగా సంపూర్ణ దృఢత్వాన్ని సాధించవచ్చు. ఇందుకు సహకరించే ప్రక్రియే 'యోగా'. అయితే ఈ యోగాసనాల వల్ల పూర్తి ఫలితం పొందాలంటే.. చేసే క్రమంలో ఎలాంటి పొరపాట్లు దొర్లకుండా జాగ్రత్తపడాలి. కానీ కొంతమంది మాత్రం అవగాహన లోపంతో యోగా చేసేటప్పుడు కొన్ని చిన్న చిన్న తప్పులు చేస్తుంటారు. ఫలితంగా యోగా చేసిన ఫలం దక్కకుండా పోతుంది. మరి ఆ పొరపాట్లేంటో ముందే తెలుసుకుని, తగిన జాగ్రత్తలు తీసుకుంటే పూర్తి ఫిట్‌నెస్‌ను సొంతం చేసుకోవచ్చు.

అనుబంధం

మరిన్ని

యూత్ కార్నర్

మరిన్ని

'స్వీట్' హోం

మరిన్ని

వర్క్ & లైఫ్

మరిన్ని

సూపర్ విమెన్

మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని