ఆందోళన తగ్గించే ఆహారం!
close
Updated : 14/06/2021 17:43 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఆందోళన తగ్గించే ఆహారం!

సెకండ్‌ వేవ్‌ మొదలైనప్పటి నుంచే చాలామందిలో తెలియకుండానే ఒత్తిడి, ఆందోళనలను పెంచేసింది. ఇప్పుడిక మూడో వేవ్‌ అంటున్నారు. అవి ఇంకాస్త పెరిగే ప్రమాదముంది. కాబట్టి, కొత్త సమస్యలు తెచ్చుకోకూడదంటే వీటికి చెక్‌ పెట్టేయాల్సిందే. ఇది ఆహారంతో సాధ్యమంటున్నారు నిపుణులు.
* గుమ్మడి గింజల్లో పొటాషియం ఎక్కువ మోతాదులో ఉంటుంది. ఇది శరీరంలో ఎలక్ట్రోలైట్‌లను సమతుల్యం చేయడంతో పాటు రక్తపోటునూ తగ్గిస్తుంది. గుమ్మడి గింజలు, అరటిని తరచుగా తీసుకుంటే ఒత్తిడి, ఆందోళనకు దూరంగా ఉండొచ్చు.
* ఆకుకూరల్లో ఉండే మెగ్నీషియం కూడా ఆందోళనను తగ్గించడంలో ప్రభావవంతంగా పనిచేస్తుంది. అలాగే ఫొలేట్‌, విటమిన్‌ బి6, బి12లు ఉండేలా రోజువారీ ఆహారాన్ని ప్లాన్‌ చేసుకోవాలి.
* డార్క్‌ చాక్లెట్‌లో థియోబ్రొమైన్‌ ఉంటుంది. ఇదీ యాంగ్జైటీకి వ్యతిరేకంగా పనిచేస్తుంది. పులిసిన పదార్థాలతో చేసే ఇడ్లీ, దోశ వంటివీ దీనికి చక్కని మందు.
* సిట్రస్‌ ఫలాలు సానుకూల ఆలోచనలనూ పెంచుతాయట. కామోమైల్‌ టీలో యాంటీ ఆక్సిడెంట్లతోపాటు ఆత్రుతŸను తగ్గించే గుణాలుంటాయి. వీటినీ తరచుగా ఆహారంలో భాగం చేసుకుంటుండాలి.


మరిన్ని

యోగాలో ఈ పొరపాట్లు దొర్లకుండా..!

మానసిక ఒత్తిడి, టెన్షన్ల నుంచి తక్షణమే విముక్తి లభిస్తే బాగుండు.. అనిపిస్తోందా? అధిక పనితో అలసిపోయిన శరీరాన్ని శక్తిమంతం చేసుకోవాలనుకుంటున్నారా? ఇవన్నీ ఒకేసారి సాధ్యమైతే.. అంతకంటే ఆనందమేముంటుంది చెప్పండి.. అటు శారీరకంగా, ఇటు మానసికంగా సంపూర్ణ దృఢత్వాన్ని సాధించవచ్చు. ఇందుకు సహకరించే ప్రక్రియే 'యోగా'. అయితే ఈ యోగాసనాల వల్ల పూర్తి ఫలితం పొందాలంటే.. చేసే క్రమంలో ఎలాంటి పొరపాట్లు దొర్లకుండా జాగ్రత్తపడాలి. కానీ కొంతమంది మాత్రం అవగాహన లోపంతో యోగా చేసేటప్పుడు కొన్ని చిన్న చిన్న తప్పులు చేస్తుంటారు. ఫలితంగా యోగా చేసిన ఫలం దక్కకుండా పోతుంది. మరి ఆ పొరపాట్లేంటో ముందే తెలుసుకుని, తగిన జాగ్రత్తలు తీసుకుంటే పూర్తి ఫిట్‌నెస్‌ను సొంతం చేసుకోవచ్చు.

అనుబంధం

మరిన్ని

యూత్ కార్నర్

మరిన్ని

'స్వీట్' హోం

మరిన్ని

వర్క్ & లైఫ్

మరిన్ని

సూపర్ విమెన్

మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని