స్వచ్ఛమైన నెయ్యికావాలా?
close
Updated : 15/06/2021 00:31 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

స్వచ్ఛమైన నెయ్యికావాలా?

దేశీ నెయ్యిలో పోషకాలతోపాటు యాంటీ ఆక్సిడెంట్‌ సమ్మేళనాలూ మెండు. దీని వల్ల రుచితో పాటు ఆరోగ్యమూ. ఇన్ని ప్రయోజనాలున్న ఈ నెయ్యి స్వచ్ఛమైందో కాదో తెలుసుకునేదెలా..
నీళ్లతో పరీక్ష... గ్లాసు నీటిలో చెంచా నెయ్యి వేయండి. నెయ్యి నీళ్లపై తేలితే అది స్వచ్ఛమైంది. అదే అడుగుకు చేరితే కల్తీ అని.
వేడి చేయడం.. పాన్‌లో రెండు మూడు చెంచాల నెయ్యి వేసి కాసేపు వేడి చేయాలి. ఆ తర్వాత ఓ రోజంతా దాన్ని అలా వదిలేయాలి. మరుసటి రోజు అది చిన్న చిన్న రేణువుల్లా మారి సువాసనలు వెదజల్లుతుంటే  స్వచ్ఛమైందేనని. ముద్దలానే ఉంటే కల్తీ అని.
ఉప్పుతో... రెండు చెంచాల నెయ్యిలో అర చెంచా ఉప్పు వేసి పక్కన పెట్టాలి. ఇరవై నిమిషాల తర్వాత నెయ్యి రంగు మారితే అది కల్తీ అనే అర్థం.
ఇలా కూడా కనిపెట్టొచ్చు...

* కాస్త నెయ్యిని అరచేతిలో వేసుకోండి. కాసేపటికి అది కరిగితే నాణ్యమైందని అర్థం.
*చెంచా నెయ్యిని పాన్‌లో వేసి వేడి చేయాలి. వెంటనే కరిగి ముదురు చాక్లెట్‌ రంగులోకి మారితే అది స్వచ్ఛమైంది. కరగడానికి ఎక్కువ సమయం పట్టి, లేత పసుపు రంగులోకి మారితే మాత్రం తేడా ఉన్నట్టు.


మరిన్ని

యోగాలో ఈ పొరపాట్లు దొర్లకుండా..!

మానసిక ఒత్తిడి, టెన్షన్ల నుంచి తక్షణమే విముక్తి లభిస్తే బాగుండు.. అనిపిస్తోందా? అధిక పనితో అలసిపోయిన శరీరాన్ని శక్తిమంతం చేసుకోవాలనుకుంటున్నారా? ఇవన్నీ ఒకేసారి సాధ్యమైతే.. అంతకంటే ఆనందమేముంటుంది చెప్పండి.. అటు శారీరకంగా, ఇటు మానసికంగా సంపూర్ణ దృఢత్వాన్ని సాధించవచ్చు. ఇందుకు సహకరించే ప్రక్రియే 'యోగా'. అయితే ఈ యోగాసనాల వల్ల పూర్తి ఫలితం పొందాలంటే.. చేసే క్రమంలో ఎలాంటి పొరపాట్లు దొర్లకుండా జాగ్రత్తపడాలి. కానీ కొంతమంది మాత్రం అవగాహన లోపంతో యోగా చేసేటప్పుడు కొన్ని చిన్న చిన్న తప్పులు చేస్తుంటారు. ఫలితంగా యోగా చేసిన ఫలం దక్కకుండా పోతుంది. మరి ఆ పొరపాట్లేంటో ముందే తెలుసుకుని, తగిన జాగ్రత్తలు తీసుకుంటే పూర్తి ఫిట్‌నెస్‌ను సొంతం చేసుకోవచ్చు.

అనుబంధం

మరిన్ని

యూత్ కార్నర్

మరిన్ని

'స్వీట్' హోం

మరిన్ని

వర్క్ & లైఫ్

మరిన్ని

సూపర్ విమెన్

మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని