అలసిన కళ్లకు.. గులాబీ నీళ్లు!
close
Updated : 18/06/2021 01:12 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అలసిన కళ్లకు.. గులాబీ నీళ్లు!

ఎక్కువసేపు కంప్యూటర్‌, ల్యాప్‌టాప్‌, ఫోన్‌లు చూడటం వల్ల కళ్లు అలసిపోతాయి. ఇది ఎక్కువ కాలం సాగితే కంటి సమస్యలు తప్పవు. దీనికి పరిష్కార మార్గాలేంటో చూద్దామా...
చల్లని నీళ్లు... కళ్లను చల్లటి నీటితో రోజులో రెండు మూడు సార్లు కడుక్కోవాలి. ఇలా చేస్తే కళ్ల మంట, నొప్పి లాంటివి తగ్గి తాజాగా మారతాయి.
రోజ్‌ వాటర్‌.. ఓ గిన్నెలో కాసిన్ని నీళ్లు, అందులో చెంచా గులాబీ నీళ్లు కలపాలి. ఈ నీటిలో దూది ఉండలను ముంచి అయిదారు నిమిషాలు కళ్లపై పెట్టుకోవాలి. రోజులో రెండు మూడు సార్లు ఇలా చేస్తే కళ్లు బరువెక్కడం, నొప్పి, మంట లాంటి సమస్యలు తగ్గిపోతాయి.
పుదీనా.. గిన్నెలో నీళ్లు పోసి, గుప్పెడు పుదీనా ఆకులు వేసి నానబెట్టాలి. మరుసటి రోజు ఉదయమే ఈ నీటిలో దూది ఉండలను ముంచి కళ్లపై కాసేపు పెట్టుకోవాలి. కళ్ల అలసట మాయమవుతుంది.
అరచేతులూ... రెండు చేతులను గట్టిగా రుద్దుకుని కళ్లమీద కాసేపు పెట్టుకోండి. వాటి వెచ్చదనం కంటికి సాంత్వన కలిగిస్తుంది.  
ఇవి కాకుండా.. అదేపనిగా కంప్యూటర్‌, ఫోన్‌ చూడకుండా మధ్యలో కళ్లకు విశ్రాంతి ఇవ్వాలి.

* కళ్లను తరచూ కడుక్కోవాలి. అలాగే తగినన్ని నీళ్లు తాగాలి.


మరిన్ని

యోగాలో ఈ పొరపాట్లు దొర్లకుండా..!

మానసిక ఒత్తిడి, టెన్షన్ల నుంచి తక్షణమే విముక్తి లభిస్తే బాగుండు.. అనిపిస్తోందా? అధిక పనితో అలసిపోయిన శరీరాన్ని శక్తిమంతం చేసుకోవాలనుకుంటున్నారా? ఇవన్నీ ఒకేసారి సాధ్యమైతే.. అంతకంటే ఆనందమేముంటుంది చెప్పండి.. అటు శారీరకంగా, ఇటు మానసికంగా సంపూర్ణ దృఢత్వాన్ని సాధించవచ్చు. ఇందుకు సహకరించే ప్రక్రియే 'యోగా'. అయితే ఈ యోగాసనాల వల్ల పూర్తి ఫలితం పొందాలంటే.. చేసే క్రమంలో ఎలాంటి పొరపాట్లు దొర్లకుండా జాగ్రత్తపడాలి. కానీ కొంతమంది మాత్రం అవగాహన లోపంతో యోగా చేసేటప్పుడు కొన్ని చిన్న చిన్న తప్పులు చేస్తుంటారు. ఫలితంగా యోగా చేసిన ఫలం దక్కకుండా పోతుంది. మరి ఆ పొరపాట్లేంటో ముందే తెలుసుకుని, తగిన జాగ్రత్తలు తీసుకుంటే పూర్తి ఫిట్‌నెస్‌ను సొంతం చేసుకోవచ్చు.

అనుబంధం

మరిన్ని

యూత్ కార్నర్

మరిన్ని

'స్వీట్' హోం

మరిన్ని

వర్క్ & లైఫ్

మరిన్ని

సూపర్ విమెన్

మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని