పంచదారకు ప్రత్యామ్నాయాలు!
close
Published : 26/06/2021 01:15 IST

పంచదారకు ప్రత్యామ్నాయాలు!


టీ కాఫీలు, పండ్ల రసాలు... ఇలా అన్నింటిలోనూ చక్కర వేస్తాం. పండగలూ, పర్వదినాలూ అంటూ స్వీట్లు లాగిస్తాం. వీటన్నింటిలోనూ చక్కెర ఎక్కువ మొత్తంలో ఉంటుంది. దీన్ని తీసుకోవడం వల్ల చాలా రకాల ఆరోగ్య సమస్యలు వస్తాయి. కాబట్టి వీలైనంత మటుకు ప్రత్యామ్నాయాలను ఎంచుకుంటే సరి.
ఖర్జూరాలు.. చక్కెరలకు బదులుగా వీటిని ఎంచక్కా వాడుకోవచ్చు. టీ, కాఫీలతోపాటు స్వీట్లలోనూ వేసుకోవచ్చు. తియ్యగానే కాదు ఎన్నో పోషకాలనూ కలిగి ఉంటాయి. కాపర్‌, ఐరన్‌, మెగ్నీషియం, మాంగనీస్‌ లాంటి ఖనిజాలతోపాటు విటమిన్‌-బి6, పీచు సమృద్ధిగా ఉంటాయి. జీవక్రియలు సాఫీగా సాగేలా సాయపడతాయి. గుండె జబ్బులకు కారణమయ్యే ఎల్‌డీఎల్‌ కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి.

తేనె... ఇది కూడా సహజ చక్కెరలా పని చేస్తుంది. దీంట్లో ఫాస్ఫరస్‌, పొటాషియం, జింక్‌, ఐరన్‌, క్యాల్షియం లాంటి ఖనిజ మూలకాలతోపాటు యాంటీఆక్సిడెంట్లు, విటమిన్‌-బి6, ఎంజైమ్‌లు, రైబోఫ్లేవిన్‌ పుష్కలంగా ఉంటాయి. ఇది యాంటీ మైక్రోబియల్‌ గుణాలతో, రోగనిరోధకతను పెంచే సమ్మేళనాలతో నిండి ఉంటుంది. కాబట్టి చక్కెరకు ప్రత్యామ్నాయంగా వాడుకోవచ్చు.

మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని

అనుబంధం

మరిన్ని

యూత్‌ కార్నర్

మరిన్ని

మంచిమాట


'స్వీట్' హోం

మరిన్ని

వర్క్‌ & లైఫ్

మరిన్ని

సూపర్‌ విమెన్

మరిన్ని