కీళ్ల నొప్పులు దరికి చేరకుండా..
close
Published : 30/06/2021 01:46 IST

కీళ్ల నొప్పులు దరికి చేరకుండా..

కదలికల్లోనూ, శరీర బరువును మోయడంలోనూ కీళ్లదే ప్రధాన పాత్ర. 30 ఏళ్లు నిండినప్పటి నుంచి ఆడ వారిలో కాల్షియం శాతం తగ్గుతుంది. పిల్లలను కనడం, అధిక బరువు కీళ్ల నొప్పులకు కారణమవుతాయి. కొన్ని జాగ్రత్తలతో ఈ సమస్య బారిన పడకుండా ఉండొచ్చు.

ఇంటి పనేగా అని చాలామంది చిన్నచూపు చూస్తారు. కానీ, శరీరంపై ఎక్కువ శ్రమ పడేలా చేస్తాయివి. కూర్చోవడం సహా ఒకే భంగిమలో ఏ పనైనా ఎక్కువసేపు చేయాల్సొస్తే మధ్యలో గుర్తుంచుకుని మరీ విరామం తీసుకోవాలి. వీలున్నప్పుడల్లా చిన్న చిన్న స్ట్రెచింగ్‌ వ్యాయామాలు చేస్తుండాలి.

* గర్భం దాల్చడం, హార్మోనుల్లో మార్పులు అధిక బరువుకు కారణమవుతాయి. దీనిపై ముందు నుంచే దృష్టిపెట్టాలి. ఆరోగ్యకరమైన ఆహారం, జీవన విధానాలతో బరువు తగ్గేలా చూసుకోవాలి.

* శరీరానికి తగినంత నీటిని అందించాలి. లేదంటే డీహైడ్రేషన్‌ సమస్య వస్తుంది. దేహం తనకు అవసరమైన నీటిని కార్టిలేజెస్‌ నుంచి గ్రహిస్తుంటుంది. ఇదీ ఎముకలు అరిగిపోవడానికి కారణమవుతుంది. చక్కెరలతో నిండిన ద్రవపదార్థాలకు దూరంగా ఉండాలి.

మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని

అనుబంధం

మరిన్ని

యూత్‌ కార్నర్

మరిన్ని

మంచిమాట


'స్వీట్' హోం

మరిన్ని

వర్క్‌ & లైఫ్

మరిన్ని

సూపర్‌ విమెన్

మరిన్ని