వయసును దాచేయండి!
close
Published : 02/07/2021 01:08 IST

వయసును దాచేయండి!

కొందరు అసలు వయసు కంటే తక్కువగా, ఇంకొందరేమో ఎక్కువగా కనిపిస్తారు. అందుక్కారణం చర్మమే. ఆరోగ్య సమస్యలు, నిద్రవేళలు, జీవన శైలిలో అపసవ్యత, హార్మోన్లలో మార్పులు మొదలైన కారణాలతో చర్మం పొడి బారుతుంది. లేజర్‌ ట్రీట్‌మెంట్‌, స్కిన్‌ టైటెనింగ్‌, కెమికల్‌ పీల్స్‌, బొటాక్స్‌ లాంటి కాస్మొటిక్‌ చికిత్సలతో తిరిగి యవ్వనాన్ని పొందే వీలున్నా, వాటివల్ల ప్రత్యక్షంగానో పరోక్షంగానో సమస్యలు ఎదురవ్వచ్చు. అందువల్ల సహజ పద్ధతులతోనే చర్మ సంరక్షణ ఉత్తమం.

వేళకు తిని, పడుకుంటే ముఖం వయసు మీరినట్లుండదు. చర్మం సాగిపోవడం లేదా కుంచించుకుపోవడం, కాంతిహీనత, కళ్ల కింద చారలు- ఈ లక్షణాలన్నీ కూడా మానసిక ఒత్తిడికి నిదర్శనాలు. నవ్వుతూ ఉన్నట్లయితే స్ట్రెస్‌ కలిగించే హార్మోన్లు తగ్గి ఎండార్ఫిన్స్‌ లాంటి ఆరోగ్యకర హార్మోన్లు విడుదలవుతాయి. కనుక సవ్యమైన జీవనశైలి, ఒత్తిడిని తగ్గించుకోవడం, సరదాగా ఉండటం- ఈ మూడింటితో పదేళ్లు తక్కువగా కనిపించేయొచ్చు.

మరిన్ని

యోగాలో ఈ పొరపాట్లు దొర్లకుండా..!

మానసిక ఒత్తిడి, టెన్షన్ల నుంచి తక్షణమే విముక్తి లభిస్తే బాగుండు.. అనిపిస్తోందా? అధిక పనితో అలసిపోయిన శరీరాన్ని శక్తిమంతం చేసుకోవాలనుకుంటున్నారా? ఇవన్నీ ఒకేసారి సాధ్యమైతే.. అంతకంటే ఆనందమేముంటుంది చెప్పండి.. అటు శారీరకంగా, ఇటు మానసికంగా సంపూర్ణ దృఢత్వాన్ని సాధించవచ్చు. ఇందుకు సహకరించే ప్రక్రియే 'యోగా'. అయితే ఈ యోగాసనాల వల్ల పూర్తి ఫలితం పొందాలంటే.. చేసే క్రమంలో ఎలాంటి పొరపాట్లు దొర్లకుండా జాగ్రత్తపడాలి. కానీ కొంతమంది మాత్రం అవగాహన లోపంతో యోగా చేసేటప్పుడు కొన్ని చిన్న చిన్న తప్పులు చేస్తుంటారు. ఫలితంగా యోగా చేసిన ఫలం దక్కకుండా పోతుంది. మరి ఆ పొరపాట్లేంటో ముందే తెలుసుకుని, తగిన జాగ్రత్తలు తీసుకుంటే పూర్తి ఫిట్‌నెస్‌ను సొంతం చేసుకోవచ్చు.

తరువాయి

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని

అనుబంధం

మరిన్ని

యూత్‌ కార్నర్

మరిన్ని

మంచిమాట


'స్వీట్' హోం

మరిన్ని

వర్క్‌ & లైఫ్

మరిన్ని

సూపర్‌ విమెన్

మరిన్ని