బ్రెడ్‌... బ్యాగులోపెట్టండి!
close
Published : 04/07/2021 01:48 IST

బ్రెడ్‌... బ్యాగులోపెట్టండి!

 

​​​​​​​ఆహారపదార్థాలు, కూరగాయలన్నింటినీ ఫ్రిజ్‌లో పెడితే ఎక్కువ రోజులు నిల్వచేయొచ్చు అనుకుంటారు చాలా మంది. అదే పొరబాటు...  

బ్రెడ్‌: దీన్ని ఫ్రిజ్‌లో ఉంచితే త్వరగా పొడిబారుతుంది. దీన్ని తేమలేని చల్లటి ప్రదేశంలో పెడితే చాలు. లేదంటే... వీటిని నిల్వ చేసే బ్రెడ్‌ బ్యాగులనీ ఎంచుకోవచ్చు.  

ఉల్లి, వెల్లుల్లి : ఫ్రిజ్‌లో ఉంచితే వాటి వాసన, రుచీ ఇతర పదార్థాలకు చేరతాయి. తేమ చేరి కుళ్లిపోయే అవకాశమూ ఉంది. వీలైనంతవరకూ ఉల్లి, వెల్లుల్లిని చీకటి ప్రదేశంలో ఉంచాలి.

బంగాళా దుంపలు: ఫ్రిజ్‌లో అస్సలు పెట్టకూడని కూరగాయల్లో ఇదొకటి. ఫ్రిజ్‌లో ఉంచితే వీటిల్లోని స్టార్చ్‌ చక్కెరగా మారుతుంది. వేపినప్పుడు ఆ చక్కెర్లు ప్రమాదకర రసాయనాలుగా మారతాయి.

మరిన్ని

యోగాలో ఈ పొరపాట్లు దొర్లకుండా..!

మానసిక ఒత్తిడి, టెన్షన్ల నుంచి తక్షణమే విముక్తి లభిస్తే బాగుండు.. అనిపిస్తోందా? అధిక పనితో అలసిపోయిన శరీరాన్ని శక్తిమంతం చేసుకోవాలనుకుంటున్నారా? ఇవన్నీ ఒకేసారి సాధ్యమైతే.. అంతకంటే ఆనందమేముంటుంది చెప్పండి.. అటు శారీరకంగా, ఇటు మానసికంగా సంపూర్ణ దృఢత్వాన్ని సాధించవచ్చు. ఇందుకు సహకరించే ప్రక్రియే 'యోగా'. అయితే ఈ యోగాసనాల వల్ల పూర్తి ఫలితం పొందాలంటే.. చేసే క్రమంలో ఎలాంటి పొరపాట్లు దొర్లకుండా జాగ్రత్తపడాలి. కానీ కొంతమంది మాత్రం అవగాహన లోపంతో యోగా చేసేటప్పుడు కొన్ని చిన్న చిన్న తప్పులు చేస్తుంటారు. ఫలితంగా యోగా చేసిన ఫలం దక్కకుండా పోతుంది. మరి ఆ పొరపాట్లేంటో ముందే తెలుసుకుని, తగిన జాగ్రత్తలు తీసుకుంటే పూర్తి ఫిట్‌నెస్‌ను సొంతం చేసుకోవచ్చు.

తరువాయి

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని

అనుబంధం

మరిన్ని

యూత్‌ కార్నర్

మరిన్ని

మంచిమాట


'స్వీట్' హోం

మరిన్ని

వర్క్‌ & లైఫ్

మరిన్ని

సూపర్‌ విమెన్

మరిన్ని