కొబ్బరి షాంపూ చేస్తారా? 
close
Updated : 04/07/2021 04:48 IST

కొబ్బరి షాంపూ చేస్తారా? 


కొద్దిగా జుట్టు పొడిబారినా కొబ్బరి నూనె రాయమనే సలహా ఇస్తుంటారు చాలామంది. రసాయనాలు నిండిన షాంపూను ఉపయోగించగానే సమస్య మళ్లీ మొదటికే. ఈసారి కొబ్బరి షాంపూను ప్రయత్నించి చూడండి. దీన్ని ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు...

కొబ్బరి నీళ్లతో.. ఈ నీటిలో విటమిన్లు, మినరల్స్‌ పుష్కలం. దీనిలోని హైడ్రేటింగ్‌ గుణాలు కుదుళ్లను దృఢపరచడంతో పాటు రక్తప్రసరణ బాగా జరిగేలా చేస్తాయి. జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తాయి. దీనిలోని యాంటీ ఫంగల్‌, యాంటీ బ్యాక్టీరియల్‌ గుణాలు చుండ్రు, దురద, ఇన్ఫెక్షన్ల నుంచీ రక్షిస్తాయి. వీటితో షాంపూకు..
ఒక కప్పులో రెండు స్పూన్ల తాజా కొబ్బరినీళ్లను తీసుకోవాలి. దానికి నాలుగు టేబుల్‌ స్పూన్ల లిక్విడ్‌ కాస్టిల్‌ సోప్‌ను కలపాలి. ఈ మిశ్రమానికి ఒక స్పూను అలోవెరా, 3-4 చుక్కల పెప్పర్‌ మింట్‌ ఆయిల్‌ కలిపి, జుట్టుకు కుదుళ్ల నుంచి చివరిదాకా పట్టించాలి. కొద్దిసేపటి తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేస్తే సరి.
కొబ్బరి పాలతో.. పావుకప్పు కొబ్బరి పాలలో టేబుల్‌ స్పూను దాల్చిన చెక్క పొడిని కలపాలి. ఈ మిశ్రమానికి టేబుల్‌ స్పూను ఆలివ్‌ ఆయిల్‌, 3 -4 చుక్కల టీ ట్రీ ఆయిల్‌ కలిపి పేస్టులా చేసుకోవాలి. దీన్ని మాడుకు పట్టించి కాసేపు వదిలేయాలి. ఎండినట్టుగా అనిపించాక వేడి నీటితో కడిగేయాలి. ఇది దుమ్మునేకాదు చుండ్రునూ బాగా తొలగిస్తుంది.

మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని

అనుబంధం

మరిన్ని

యూత్‌ కార్నర్

మరిన్ని

మంచిమాట


'స్వీట్' హోం

మరిన్ని

వర్క్‌ & లైఫ్

మరిన్ని

సూపర్‌ విమెన్

మరిన్ని