బరువులెత్తగలరా..?
close
Published : 05/07/2021 00:41 IST

బరువులెత్తగలరా..?

అమ్మాయిలు సుకుమారులనీ, బరువులెత్తలేరనే అపవాదుని... నేటితరం ఆడపిల్లలు పోగొడుతున్నారు. అసలు వాటివల్ల లాభమేంటో తెలుసుకుందామా?

* బరువులెత్తి చేసే వ్యాయామాలని స్ట్రెంత్‌ట్రైనింగ్‌ కసరత్తులని కూడా అంటారు. తక్కిన వాటితో పోలిస్తే... ఇది మహిళలకు ఎక్కువ మేలు చేస్తుందని అంటున్నాయి అధ్యయనాలు. వీటిని కనీసం పదివారాలు క్రమం తప్పకుండా చేస్తే శరీరంలో ఫీల్‌గుడ్‌ ఎండార్ఫిన్లు పుష్కలంగా విడుదలవుతాయట. ఫలితంగా ఒత్తిడికి దూరంగా ఉండగలరు.

* వారంలో మూడు రోజుల పాటూ ఈ స్ట్రెంతనింగ్‌ వ్యాయామాలకి తోడుగా... పరుగూ, నడక వంటి కార్డియో వ్యాయామాలూ చేయగలిగితే గుండె ఆరోగ్యంగా ఉంటుంది. రక్తప్రసరణ సక్రమంగా జరుగుతుంది. నిద్రలేమి ఉండదు.

* ఈ వ్యాయామాలు ఎముక సాంద్రతని పెంచి, ఆస్టియోపొరోసిస్‌ వంటి సమస్యలు రాకుండా అడ్డుకుంటాయట. ముఖ్యంగా ఏంటీయర్‌ కార్టికల్‌ లిగమెంట్‌ పాడవుతుంది. దీనినే ఏసీఎల్‌ టియర్స్‌ అని కూడా అంటారు. ఈ సమస్య స్త్రీలలోనే ఎక్కువ. దాంతో నడుము దిగువ భాగం దగ్గరా, మోకాళ్ల దగ్గర తీవ్రమైన నొప్పులు ఉంటాయి. ఈ సమస్యను అదుపులో ఉంచడానికి స్ట్రెంతనింగ్‌ కసరత్తులు బాగా ఉపయోగపడతాయి. ఇవి కనీసం మూడునెలలు క్రమం తప్పకుండా చేయగలిగితే... చిన్నపాటి శ్రమకే అలసిపోవడం తగ్గుతుంది.

మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని

అనుబంధం

మరిన్ని

యూత్‌ కార్నర్

మరిన్ని

మంచిమాట


'స్వీట్' హోం

మరిన్ని

వర్క్‌ & లైఫ్

మరిన్ని

సూపర్‌ విమెన్

మరిన్ని