చాక్లెట్లను భేషుగ్గా తిందాం
close
Published : 06/07/2021 00:29 IST

చాక్లెట్లను భేషుగ్గా తిందాం

* ఆడుకునే, పరుగులెత్తే సమయంలో చాక్లెట్‌ తినడంవల్ల ఆక్సిజన్‌ సక్రమంగా అందుతుంది.'

* గర్భిణిలు రోజుకొక ఔన్సు చాక్లెట్‌ తింటే పిండం చక్కగా పెరుగుతుందని అట్లాంటాలో ‘మెటర్నల్‌ ఫెటల్‌ మెడిసిన్‌’ పరిశోధనలో తేలింది.

న్నం తినడానికి మారాం చేసే పిల్లలు చాక్లెట్లు మాత్రం మహా ఇష్టపడతారు. కానీ ఆకలి మందగిస్తుంది, పళ్లు పుచ్చిపోతాయంటూ పెద్దలు భయపెట్టడం తెలిసిందే. మధుమేహం లాంటి సమస్యలుంటే తప్ప.. చాక్లెట్లని దూరం పెట్టాల్సిన, బాధపడాల్సిన అవసరం లేదని తేల్చారు పరిశోధకులు. కనుక ఇకపై చాక్లెట్ల గురించి జడవాల్సిన పనిలేదు. అతిగా తింటే ఊబకాయం రావచ్చు, పళ్ల సమస్యలు రావచ్చు. మితంగా తింటే మాత్రం మంచిదే. అమెరికన్‌ సర్వేలు అదే చెబుతున్నాయి. తాజాగా ‘నెదర్‌ల్యాండ్స్‌ జర్నల్‌ ఆఫ్‌ మెడిసిన్‌’ కూడా చాక్లెట్లు తింటే మంచిదేనని వెల్లడించింది. ఇకనేం.. చాక్లెట్లను భేషుగ్గా తిందాం.

చాక్లెట్లలో యాంటీ ఆక్సిడెంట్లు అధికం. ఇవి శరీరాన్ని సమతులంగా ఉంచుతూ ఆరోగ్యాన్ని కాపాడతాయి.

మంచి పోషకాహారం. నీరసాన్ని తగ్గించి వేగంగా శక్తినిస్తాయి.

ఎండవేడిమి నుంచి శరీరాన్ని కాపాడతాయి. చర్మానికి కాంతినిస్తాయి.

కొలెస్ట్రాల్‌ సాయిని తగ్గిస్తాయి. రక్తపోటును అదుపులో ఉంచుతాయి.

ఒత్తిడిని తగ్గిస్తాయి. మతిమరుపు రాకుండా చేస్తాయి.

చాక్లెట్లలో ఉండే కొకొవా శరీరం, మెదడు చురుగ్గా ఉండేలా చేస్తుంది.

చాక్లెట్లు తినడంవల్ల త్వరగా ముడతలు రావు.

బాధ, దిగులు లాంటి మూడ్స్‌ను పోగొట్టి సంతోషంగా ఉంచుతాయి.

మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని

అనుబంధం

మరిన్ని

యూత్‌ కార్నర్

మరిన్ని

మంచిమాట


'స్వీట్' హోం

మరిన్ని

వర్క్‌ & లైఫ్

మరిన్ని

సూపర్‌ విమెన్

మరిన్ని