ఉప్పుతో నోటి దుర్వాసన దూరం!
close
Published : 08/07/2021 00:36 IST

ఉప్పుతో నోటి దుర్వాసన దూరం!

చాలామంది నోటి దుర్వాసనతో బాధపడుతుంటారు. దీనికి కారణాలనేకం. అయితే నలుగురిలోకి వెళ్లినప్పుడు ఈ సమస్య ఉంటే చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. మరి వంటింట్లో ఉండే పదార్థాలతో దీన్ని ఎలా తగ్గించుకోవాలో చూద్దామా!

కారణాలివి... * దంతాలు, నోటిని సరిగా శుభ్రం చేసుకోకపోవడం * తరచూ నోరు పొడిబారడం * చిగుళ్ల సమస్యలు * దంతాల్లో క్యావిటీ  * ఉల్లి, వెల్లుల్లి ఎక్కువగా తీసుకోవడం... * పళ్ల మధ్య ఆహారం ఇరుక్కుపోవడం, నాలుకపై పేరుకోవడం. * మధుమేహం

తగ్గించుకునేందుకు... కొబ్బరినూనె... చెంచా కొబ్బరినూనెను నోట్లో పోసుకుని అయిదు నుంచి పదినిమిషాలు పుక్కిలించాలి. ఆ తర్వాత గోరువెచ్చటి నీటితో ఊసేయాలి. రోజుకు రెండుసార్లు ఇలా చేస్తే దుర్వాసన దూరమవుతుంది. ఈ నూనెలోని యాంటీబ్యాక్టీరియల్‌, యాంటీమైక్రోబియల్‌ సమ్మేళనాలు మెండుగా ఉంటాయి.

ఉప్పు... గ్లాసు గోరువెచ్చటి నీటిలో చెంచా ఉప్పు వేసుకుని పుక్కిలించాలి. ఇలా చేస్తే నోటి దుర్వాసన పోవడమే కాకుండా గొంతులో గరగర, నొప్పీ లాంటివీ తగ్గుతాయి.

సోంపు... అన్నం తిన్న వెంటనే అర చెంచా సోంపు తినాలి. దీనిలోని యాంటీ బ్యాక్టీరియల్‌, యాంటీవైరల్‌ సమ్మేళనాలు జీర్ణక్రియ సాఫీగా సాగేలా చేస్తాయి.

మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని

అనుబంధం

మరిన్ని

యూత్‌ కార్నర్

మరిన్ని

మంచిమాట


'స్వీట్' హోం

మరిన్ని

వర్క్‌ & లైఫ్

మరిన్ని

సూపర్‌ విమెన్

మరిన్ని