ఆరోగ్యాన్నిచ్చే సగ్గుబియ్యం
close
Published : 09/07/2021 00:35 IST

ఆరోగ్యాన్నిచ్చే సగ్గుబియ్యం

మంచి ముత్యాల్లాంటి సగ్గుబియ్యమంటే ఆడవాళ్లకి మహా ఇష్టం కదూ! సులువుగా పాయసం చేసేయొచ్చు. ఉడికించి చీరలు, చుడీదార్లకు గంజి పెట్టేసుకోవచ్చు. దానివల్ల ఇంకా ఏమేం లాభాలున్నాయో చూద్దాం...

గ్గుబియ్యంలో కార్బోహైడ్రేట్లు అధికం. ఇది మంచి ఎనర్జీ బూస్టర్‌.

* సహజంగా ఏ రుచీ ఉండదు కనుక స్వీట్లు, సూపు మొదలైన వాటిల్లో వాడతారు.

* ఉప్మా, కిచిడీ చేయొచ్చు. సులువూ, రుచీ కూడా.

* నూనెలో వేయించి ఉప్పూ కారం జల్లితే పిల్లలు ఇష్టంగా తింటారు.

* కడుపునొప్పి, డయేరియా, జ్వరం, నిస్సత్తువ, బరువు తగ్గిపోవడం లాంటి సందర్భాల్లో సగ్గు జావ ఔషధంలా పనిచేస్తుంది.

* ఇందులోని పీచుపదార్థం జీర్ణవ్యవస్థకు మేలు చేస్తుంది.

* రక్తపోటును నియంత్రించే పొటాషియం ఉంది. కొలెస్ట్రాల్‌ స్థాయుల్ని పెరగనివ్వదు.

* కాల్షియం, అమినో ఆసిడ్స్‌ ఉన్నందున ఎముకలకు, జుట్టుకు మంచిది.

* బరువు పెరగాలనుకునే వాళ్లు సగ్గు బియ్యం జావ తాగితే ఫలితం ఉంటుంది.

* గర్భిణులకు ఐరన్‌, క్యాల్షియం లాంటి పోషకాలను అందిస్తుంది.

* ఆరోగ్యానికే కాదు, అందానికీ పనికొస్తుంది. నానబెట్టిన సగ్గుబియ్యంలో పాలు, తేనె కలిపి ముఖానికి రాసి అరగంట తర్వాత గోరువెచ్చటి నీటితో కడిగితే చర్మానికి కాంతి వస్తుంది, ముడతలు రావు.

మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని

అనుబంధం

మరిన్ని

యూత్‌ కార్నర్

మరిన్ని

మంచిమాట


'స్వీట్' హోం

మరిన్ని

వర్క్‌ & లైఫ్

మరిన్ని

సూపర్‌ విమెన్

మరిన్ని