భలేభలే నేరేడు పళ్లు
close
Published : 11/07/2021 00:44 IST

భలేభలే నేరేడు పళ్లు

* వర్షాకాలం వస్తూనే నేరేడుపళ్లను తెచ్చేస్తుంది. ఈ పండ్లే కాదు, విత్తనాలు, ఆకులు, కాండం, బెరడు.. ఇలా మొత్తం చెట్టు నిండా ఔషధ గుణాలున్నాయి.

నేరేడులో...

* సి విటమిన్‌, ఐరన్‌ విస్తారంగా ఉన్నందున రక్తంలో ఆక్సిజన్‌, హిమోగ్లోబిన్‌ తగ్గకుండా చేస్తాయి. రక్తాన్ని శుద్ధి చేస్తాయి. ఇందులో ఉన్న ఏస్ట్రిజెంట్‌ చర్మాన్ని మృదువుగా ఉంచుతుంది. పీచు జీర్ణశక్తికి ఉపయోగపడుతుంది.

* విటమిన్లు, మినరల్స్‌ రోగనిరోధక శక్తిని పెంచుతాయి. సాధారణ జలుబు, దగ్గు, ఫ్లూలను తగ్గిస్తుంది.

* ఎ విటమిన్‌ కళ్లను ఆరోగ్యంగా ఉంచుతుంది. మెగ్నీషియం మధుమేహాన్ని తగ్గిస్తుంది.

* ఎలెజిక్‌ యాసిడ్‌ హైపర్‌టెన్షన్ని నియంత్రిస్తుంది.

* నేరేడు పండు ఊబకాయాన్ని తగ్గిస్తుంది.

* దీని రసం తలకు రాసుకుని కాసేపయ్యాక స్నానం చేస్తే చుండ్రు తగుతుంది.

* దీని పళ్ల రసం హైబీపీని తగ్గిస్తుంది. గుడ్‌ కొలెస్ట్రాల్‌ను పెంచుతుంది. గొంతు సమస్యలను, మొలల వ్యాధిని నివారిస్తుంది. ఆకులు దంతాలను దృఢంగా ఉంచుతాయి.

మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని

అనుబంధం

మరిన్ని

యూత్‌ కార్నర్

మరిన్ని

మంచిమాట


'స్వీట్' హోం

మరిన్ని

వర్క్‌ & లైఫ్

మరిన్ని

సూపర్‌ విమెన్

మరిన్ని