అదిరే అధరాలు..
close
Published : 11/07/2021 00:44 IST

అదిరే అధరాలు..

ముఖంలో కళ్ల తర్వాత ఆకర్షణీయంగా కనిపించేది పెదాలే. అవి పగలకుండా, పొడిబారకుండా ఆహా అనిపించాలంటే కొన్ని చిట్కాలు పాటించాల్సిందే మరి.

* మంచి పోషకాహారం, తగినంత నిద్ర తక్కిన శరీర భాగాల్లాగే పెదాలకూ అవసరం.

* ఎండలో తిరిగేటప్పుడు మెలనిన్‌ తగ్గే అవకాశముంది. కనుక లిప్‌ బామ్‌ తప్పకుండా రాయండి.

* పెదాలు పగిలితే గిల్లి చర్మాన్ని తొలగించడం వల్ల సమస్య జటిలమవుతుంది. వెన్న, నిమ్మరసం, దోస లేదా టొమేటో గుజ్జు పెదాల పగుళ్లను తగ్గిస్తాయి. తరచుగా పెదాలు పగులుతుంటే టూత్‌పేస్టు లేదా తింటున్న పదార్థాల వల్ల ఎలర్జీ అయ్యుంటుందేమో చెక్‌ చేసుకోండి.

* నూరిన గులాబి రేకల్లో తేనె, పాలు కలిపి పెదాలకు దట్టించి పావుగంట తర్వాత కడిగితే మృదువుగా ఉంటాయి. రాత్రి పడుకునే ముందు నేతితో పెదాలను మర్దనా చేయడం వల్ల కూడా సత్ఫలితం ఉంటుంది.

* శరీరం డీ హైడ్రేషన్‌కు లోనయితే ఆ ప్రభావం పెదాల మీద ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. మీరెక్కడికెళ్లినా వాటర్‌ బాటిల్‌ మర్చిపోకండి. రోజుకు రెండు లీటర్ల నీళ్లు తాగితే పెదాలు ఆరోగ్యంగా ఉంటాయి. మీ మేనిఛాయకు అనువైన రంగులను ఎంచుకోండి. బ్రాండెడ్‌ లిప్‌స్టిక్‌లు మాత్రమే వాడాలి. లేదంటే వాటిల్లోని చవకరకపు రసాయనాలు హాని చేయొచ్చు.

మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని

అనుబంధం

మరిన్ని

యూత్‌ కార్నర్

మరిన్ని

మంచిమాట


'స్వీట్' హోం

మరిన్ని

వర్క్‌ & లైఫ్

మరిన్ని

సూపర్‌ విమెన్

మరిన్ని