ఆరోగ్యానికి టీ...
close
Published : 11/07/2021 00:45 IST

ఆరోగ్యానికి టీ...

రోజులో ఒకసారైనా టీ తీసుకునే మహిళల్లో రక్తహీనత తగ్గి, పోషకాల శాతం పెరుగుతున్నట్లు తాజా అధ్యయనం ఒకటి రుజువు చేసింది. పోషకాహార లోపం ఉన్న వారిలో ఆ లోటును టీలోని విటమిన్‌ బి12, ఫోలిక్‌ యాసిడ్స్‌ భర్తీ చేస్తున్నట్లుగా తేల్చింది. ‘బీఎమ్‌జే న్యూట్రిషన్‌ ప్రివెన్షన్‌ అండ్‌ హెల్త్‌’ ఆన్‌లైన్‌ జర్నల్‌ దీన్ని ప్రచురించింది. మన దేశంలోని మహిళలపై ఈ అధ్యయనాన్ని నిర్వహించారు. టీ ద్వారా ఫోలిక్‌ యాసిడ్‌ను శరీరం గ్రహిస్తుంది. మహిళలకు వచ్చే పలురకాల క్యాన్సర్‌ల బారిన పడకుండా ఇది కాపాడుతుందని తేలింది. టీలో ఉండే బి12 ఎర్రరక్తకణాల ఉత్పత్తిలో తోడ్పడుతుంది. ఎముకలను ఆరోగ్యంగా ఉంచి, ఆస్టియో పొరోసిస్‌ను దూరం చేస్తుంది. ఒత్తిడిని దరికి చేరనివ్వదు. అనారోగ్యాల నుంచి పరిరక్షిస్తుంది. జుట్టు, చర్మాన్ని ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది.

మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని

అనుబంధం

మరిన్ని

యూత్‌ కార్నర్

మరిన్ని

మంచిమాట


'స్వీట్' హోం

మరిన్ని

వర్క్‌ & లైఫ్

మరిన్ని

సూపర్‌ విమెన్

మరిన్ని