అవిసె నూనెతో అందం!
close
Published : 14/07/2021 01:23 IST

అవిసె నూనెతో అందం!

చర్మ సంరక్షణకు ఎన్ని నూనెలు వాడినా... అవిసెతో వచ్చే ప్రయోజనాలు ప్రత్యేకం. అవేంటో తెలుసుకుందామా!

వారంలో కనీసం రెండు సార్లైనా అవిసె నూనెను ఒంటికి పట్టించి మర్దనా చేసి చూడండి. అంతేకాదు... వాపు, ఎరుపు వంటి ఇబ్బందులను తగ్గిస్తుంది. చర్మానికి తేమ అందించి తాజాగా మెరిసిపోయేలా చేస్తుంది.

* తరచూ ఎండలో తిరిగేవారి చర్మం టాన్‌ పట్టి నిర్జీవంగా కనిపిస్తుంది. వీరు ఉలవపిండిలో కాస్త అవిసెనూనె కలిపి ఒంటికి పట్టించి నలుగు పెట్టండి. రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. టాన్‌ తగ్గి ఒంటి ఛాయ మెరుగుపడుతుంది. ఇందులోని పోషకాలు అతినీలలోహిత కిరణాల నుంచి చర్మాన్ని కాపాడతాయి.

* రోజూ రాత్రి పూట కొద్దిగా అవిసెనూనెను తీసుకుని కళ్ల చుట్టూ నల్లటి వలయాలు, చర్మం మీద మచ్చలు ఉన్న చోట రాయండి. ఇలా తరచూ చేస్తూంటే మీ సమస్య దూరమవుతుంది.

మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని

అనుబంధం

మరిన్ని

యూత్‌ కార్నర్

మరిన్ని

మంచిమాట


'స్వీట్' హోం

మరిన్ని

వర్క్‌ & లైఫ్

మరిన్ని

సూపర్‌ విమెన్

మరిన్ని