గోటి ఆరోగ్యానికి...బాదం నూనె!
close
Published : 21/07/2021 00:42 IST

గోటి ఆరోగ్యానికి...బాదం నూనె!

చేతికైనా, కాళ్లకైనా అందం తెచ్చిపెట్టేవి గోళ్లే.  వాటిపై తగినంత శ్రద్ధ చూపిస్తేనే... చూడ్డానికీ బాగుంటాయి. ఆరోగ్యంగానూ ఉంటాయి.
నెయిల్‌పెయింట్‌ గోళ్లకు అందం తెచ్చిపెడుతుందన్న మాట నిజమే అయినా...తరచూ వేసుకోవడం, రసాయనాలతో తుడవడం వంటివాటివల్ల అవి పాడయ్యే ప్రమాదం ఉంది. విరిగిపోవచ్చు, రంగూ మారొచ్చు. అందుకే మధ్యలో వారం పదిహేను రోజులు విరామం ఇచ్చి.. వాటికి తగిన పోషణ అందించాలి. అప్పుడే అవి ఆరోగ్యంగానూ ఉంటాయి.

* వారానికోసారైనా సరే గోరు వెచ్చని కొబ్బరినూనెలో రెండు చుక్కల బాదం నూనె వేసి ఓ పది నిమిషాలు గోళ్లను అందులో నాననివ్వండి. వీటిలోని ఇతర పోషకాలు విరిగిపోయే సమస్యను అదుపులో ఉంచుతాయి.
* బయోటిన్‌, విటమిన్‌ ఇ, డిలు తగినంతగా శరీరానికి అందినప్పుడు... గోళ్లు చూడచక్కగా ఉంటాయి. పొడిబారి, చిట్లకుండా బయోటిన్‌, విటమిన్‌ ఇ క్రీములు వాడొచ్చు. ఈ పోషకాలు ఉండే పదార్థాలను ఆహారంలో భాగం చేసుకోవాలి. వీటితో పాటు మృతకణాలు తొలగించడం, ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకోవడం వంటివి చేస్తే మేలు.

మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని

అనుబంధం

మరిన్ని

యూత్‌ కార్నర్

మరిన్ని

మంచిమాట


'స్వీట్' హోం

మరిన్ని

వర్క్‌ & లైఫ్

మరిన్ని

సూపర్‌ విమెన్

మరిన్ని