డి విటమిన్‌ సరిపోతోందా?
close
Updated : 27/07/2021 06:46 IST

డి విటమిన్‌ సరిపోతోందా?

లాక్‌డౌన్‌ తర్వాత చాలామంది ఇంటికే పరిమితమయ్యారు. ఎండ పొడే తగలకుండా పోయింది. కానీ దీనివల్ల బోలెడు ఆరోగ్య సమస్యలు ఉన్నాయని తెలుసా?

రీరానికి కావాల్సిన డి విటమిన్‌ ఎండ నుంచే వస్తుంది. దీని లోపం ప్రారంభంలో పెద్దగా తెలీదు. కానీ పోనుపోనూ కీళ్లనొప్పులు, నడుం నొప్పి, అలసిపోవడం, డిప్రెషన్‌, నిద్రలేమి వంటి సమస్యలొస్తాయి. బరువు పెరగడం, విటమిన్‌ లోపం, ఇమ్యూనిటీ, ఎముకల బలం తగ్గడానికీ కారణమవుతుంది. కాబట్టి, వారానికి కనీసం రెండు రోజులు ఉదయాన్నే ఎండలో కొంత సమయం గడపాలి. కనీసం 15-20 నిమిషాలుండేలా చూసుకోవాలి. దీంతో పాటు కొన్ని ఆహార పదార్థాలను తరచూ తీసుకుంటే.. ఈ లోటును కొంత వరకూ భర్తీ చేసుకోవచ్చు.

అవేంటంటే..

* రోజుకు రెండు వెల్లుల్లి రెబ్బలు లేదా నాలుగు లవంగాలను పరగడుపున లేదా రాత్రి భోజనం తర్వాత తీసుకోవాలి. వారానికోసారి మష్రూమ్‌ను తీసుకుంటే శరీంలో విటమిన్‌ డి స్థాయులను నిలకడగా ఉంచుతుంది. రాగి రోటీ, ఆవాలు, పసుపులను ఆహారంలో చేర్చుకున్నా ఫలితం ఉంటుంది.

* రోజూ చిన్నముక్క డార్క్‌ చాక్లెట్‌ను తీసుకోవాలి. కొత్తిమీర, ఆరెంజ్‌, యోగర్ట్‌, చీజ్‌లనూ ఎంచుకోవచ్చు. ఇవి ఇమ్యూనిటీని పెంచడానికీ సాయపడతాయి. మరీ అవసరమైతే ట్యాబ్లెట్లనూ తీసుకోవచ్చు. దీనికి వైద్యుల సలహాను తీసుకోవడం తప్పనిసరి.

మరిన్ని

యోగాలో ఈ పొరపాట్లు దొర్లకుండా..!

మానసిక ఒత్తిడి, టెన్షన్ల నుంచి తక్షణమే విముక్తి లభిస్తే బాగుండు.. అనిపిస్తోందా? అధిక పనితో అలసిపోయిన శరీరాన్ని శక్తిమంతం చేసుకోవాలనుకుంటున్నారా? ఇవన్నీ ఒకేసారి సాధ్యమైతే.. అంతకంటే ఆనందమేముంటుంది చెప్పండి.. అటు శారీరకంగా, ఇటు మానసికంగా సంపూర్ణ దృఢత్వాన్ని సాధించవచ్చు. ఇందుకు సహకరించే ప్రక్రియే 'యోగా'. అయితే ఈ యోగాసనాల వల్ల పూర్తి ఫలితం పొందాలంటే.. చేసే క్రమంలో ఎలాంటి పొరపాట్లు దొర్లకుండా జాగ్రత్తపడాలి. కానీ కొంతమంది మాత్రం అవగాహన లోపంతో యోగా చేసేటప్పుడు కొన్ని చిన్న చిన్న తప్పులు చేస్తుంటారు. ఫలితంగా యోగా చేసిన ఫలం దక్కకుండా పోతుంది. మరి ఆ పొరపాట్లేంటో ముందే తెలుసుకుని, తగిన జాగ్రత్తలు తీసుకుంటే పూర్తి ఫిట్‌నెస్‌ను సొంతం చేసుకోవచ్చు.

తరువాయి

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని

అనుబంధం

మరిన్ని

యూత్‌ కార్నర్

మరిన్ని

మంచిమాట


'స్వీట్' హోం

మరిన్ని

వర్క్‌ & లైఫ్

మరిన్ని

సూపర్‌ విమెన్

మరిన్ని