వ్యాయామం ముందు... ఆ తర్వాత...
close
Published : 03/08/2021 01:00 IST

వ్యాయామం ముందు... ఆ తర్వాత...

లక్ష్మి కొత్తగా వ్యాయామం చేస్తోంది. అయితే ఎక్సర్‌సైజ్‌ చేసే ముందు, ఆ తర్వాత ఏం తినాలో అవగాహన లేక ఇబ్బందులు పడుతోంది. వర్కవుట్‌ చేసిన తర్వాత శక్తిలేనట్లు డీలా పడిపోతోంది. అయితే వ్యాయామానికి ముందు, తర్వాత ఏం తీసుకోవాలో తెలుసుకుంటే తగిన ఫలితాలు దక్కుతాయంటున్నారు ఫిట్‌నెస్‌ నిపుణులు. ఈ సమస్య పరిష్కారానికి కొన్ని సూచనలూ అందిస్తున్నారు.

ముందుగా...
వర్కవుట్‌ చేసే ముందు ఆహారం తీసుకోవడం తప్పని సరి. ఇది చాలా ముఖ్యమైంది. ఏమీ తినకుండా చేయడం మంచిది కాదు. అవసరమైన శక్తిని తయారు చేసుకోవడానికి శరీరానికి అరగంట ముందు తగిన ఆహారాన్ని అందించాల్సిందే. అరటి పండు లేదా యాపిల్‌ను తీసుకోవచ్చు. లేదంటే ద్రాక్ష, స్ట్రాబెర్రీ ముక్కలను నాలుగైదు కలిపిన కప్పు ఓట్స్‌ను తింటే మంచిది. అలాగే కప్పు పోహాను తీసుకోవచ్చు. పీనట్‌బటర్‌ రాసిన బ్రెడ్‌ ముక్కను తిని వర్కవుట్‌కు వెళ్లొచ్చు. తేలికగా జీర్ణమై, శరీరానికి శక్తిని అందించేలా ఆహారం ఉంటే చాలు. అలాకాకుండా కొవ్వు ఎక్కువగా ఉండేవి, వేపుళ్లు చేసిన ఆహారాన్ని మాత్రం తీసుకుంటే వ్యాయామం కష్టమవుతుంది.

తర్వాత..
వర్కవుట్‌ చేసిన తర్వాత శరీరంలో శక్తిస్థాయులు తగ్గుతాయి. వీటిని పునరుద్ధరించే దిశగా ఆరోగ్యకరమైన కొవ్వు, కార్బొహైడ్రేట్లు, ప్రొటీన్లు ఉండే ఆహారాన్ని ఎంచుకోవాలి. శరీరానికి తగినంత నీటిని అందించడం మర్చిపోకూడదు. లేదంటే డీహైడ్రేషన్‌కు గురయ్యే ప్రమాదం ఉంది. అరటిపండు, నట్స్‌ కలిపిన స్మూతీ లేదా, నట్స్‌, పొద్దుతిరుగుడు విత్తనాలు, వేరుశనగ, అవిసెగింజలు వంటివి తీసుకుంటే మంచిది. అలాగే ఉడికించిన గుడ్డు ప్రొటీన్‌ను అందిస్తుంది. చెెర్రీపండ్లను పెరుగులో కలిపి తినాలి. లంచ్‌లో తాజా కూరగాయలు, ఆకుకూరలుండేలా జాగ్రత్తపడాలి. వీటన్నింటినీ పాటిస్తే వ్యాయామం ఆరోగ్యంతోపాటు చక్కని శరీరసౌష్టవాన్ని అందిస్తుంది.

మరిన్ని

యోగాలో ఈ పొరపాట్లు దొర్లకుండా..!

మానసిక ఒత్తిడి, టెన్షన్ల నుంచి తక్షణమే విముక్తి లభిస్తే బాగుండు.. అనిపిస్తోందా? అధిక పనితో అలసిపోయిన శరీరాన్ని శక్తిమంతం చేసుకోవాలనుకుంటున్నారా? ఇవన్నీ ఒకేసారి సాధ్యమైతే.. అంతకంటే ఆనందమేముంటుంది చెప్పండి.. అటు శారీరకంగా, ఇటు మానసికంగా సంపూర్ణ దృఢత్వాన్ని సాధించవచ్చు. ఇందుకు సహకరించే ప్రక్రియే 'యోగా'. అయితే ఈ యోగాసనాల వల్ల పూర్తి ఫలితం పొందాలంటే.. చేసే క్రమంలో ఎలాంటి పొరపాట్లు దొర్లకుండా జాగ్రత్తపడాలి. కానీ కొంతమంది మాత్రం అవగాహన లోపంతో యోగా చేసేటప్పుడు కొన్ని చిన్న చిన్న తప్పులు చేస్తుంటారు. ఫలితంగా యోగా చేసిన ఫలం దక్కకుండా పోతుంది. మరి ఆ పొరపాట్లేంటో ముందే తెలుసుకుని, తగిన జాగ్రత్తలు తీసుకుంటే పూర్తి ఫిట్‌నెస్‌ను సొంతం చేసుకోవచ్చు.

తరువాయి

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని

అనుబంధం

మరిన్ని

యూత్‌ కార్నర్

మరిన్ని

మంచిమాట


'స్వీట్' హోం

మరిన్ని

వర్క్‌ & లైఫ్

మరిన్ని

సూపర్‌ విమెన్

మరిన్ని