జుట్టు బలానికి గుడ్డు
close
Updated : 08/08/2021 05:28 IST

జుట్టు బలానికి గుడ్డు

జుట్టుకి బలం చేకూరుస్తూ, మెరిపించే సుగుణాలు గుడ్డులో పుష్కలంగా ఉన్నాయి. మరి దీన్ని ఎలా ఉపయోగించాలో తెలుసా?

మూడు గుడ్లను పచ్చసొనతో సహా తీసుకుని నిమ్మరసం వేసి గిలకొట్టండి. దీన్ని తలకు రాసుకుని ఇరవై నిమిషాలయ్యాక కడిగేస్తే సరి. ఇది జుట్టుని బలంగా మారుస్తుంది. చుండ్రునూ తగ్గిస్తుంది.

* ఓ గుడ్డు కొట్టి దాంట్లో టేబుల్‌ స్పూన్‌ ఆవనూనె, రెండు చెంచాల కలబంద గుజ్జు వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని తలకి రాసి, గంటయ్యాక తలస్నానం చేయాలి. ఇలా తరచూ చేస్తుంటే... జుట్టు రాలడం తగ్గుతుంది. మృదువుగా, నిగారింపుతో కనిపిస్తుంది.

* పచ్చసొనలో కొంచెం కొబ్బరినూనె, తేనె కలపాలి. ఈ మిశ్రమాన్ని మాడుకు పట్టించి మర్దనా చేయండి. తరువాత చల్లని నీటితో కడిగేయండి. ఇలా చేస్తే జుట్టు బలంగా, మృదువుగా మారుతుంది. అలాగే జుట్టు చిట్లిపోయే సమస్య దూరమవుతుంది.మరిన్ని

యోగాలో ఈ పొరపాట్లు దొర్లకుండా..!

మానసిక ఒత్తిడి, టెన్షన్ల నుంచి తక్షణమే విముక్తి లభిస్తే బాగుండు.. అనిపిస్తోందా? అధిక పనితో అలసిపోయిన శరీరాన్ని శక్తిమంతం చేసుకోవాలనుకుంటున్నారా? ఇవన్నీ ఒకేసారి సాధ్యమైతే.. అంతకంటే ఆనందమేముంటుంది చెప్పండి.. అటు శారీరకంగా, ఇటు మానసికంగా సంపూర్ణ దృఢత్వాన్ని సాధించవచ్చు. ఇందుకు సహకరించే ప్రక్రియే 'యోగా'. అయితే ఈ యోగాసనాల వల్ల పూర్తి ఫలితం పొందాలంటే.. చేసే క్రమంలో ఎలాంటి పొరపాట్లు దొర్లకుండా జాగ్రత్తపడాలి. కానీ కొంతమంది మాత్రం అవగాహన లోపంతో యోగా చేసేటప్పుడు కొన్ని చిన్న చిన్న తప్పులు చేస్తుంటారు. ఫలితంగా యోగా చేసిన ఫలం దక్కకుండా పోతుంది. మరి ఆ పొరపాట్లేంటో ముందే తెలుసుకుని, తగిన జాగ్రత్తలు తీసుకుంటే పూర్తి ఫిట్‌నెస్‌ను సొంతం చేసుకోవచ్చు.

తరువాయి

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని

అనుబంధం

మరిన్ని

యూత్‌ కార్నర్

మరిన్ని

మంచిమాట


'స్వీట్' హోం

మరిన్ని

వర్క్‌ & లైఫ్

మరిన్ని

సూపర్‌ విమెన్

మరిన్ని